ఓటీటీలోకి వచ్చేసిన మూడు సినిమాలు.. ఎందులో చూడొచ్చంటే? | Family Star And Tillu Square Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

OTT Movies: ఈ వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు చూసేస్తే సరి!

Apr 26 2024 8:38 AM | Updated on Apr 26 2024 8:38 AM

 Family Star And Tillu Square Movie OTT Streaming Details

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి చాలా సినిమాలు వచ్చేశాయి. కాకపోతే వాటిలో ఓ మూడు మాత్రమే జనాలకు కాస్త ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండగా, హిందీ మూవీ కూడా ఒకటుంది. ఇప్పుడు అవన్నీ కూడా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కొందరు ఆల్రెడీ చూసేస్తుండగా, మరికొందరు ఎప్పుడు చూడాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఇవన్నీ ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

'డీజే టిల్లు' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు.. దీని సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' తీశాడు. చాలాసార్లు వాయిదా పడి మార్చి 29న థియేటర్లలోకి వచ్చింది. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. చూసి కడుపుబ్బా నవ్వుకోవడానికి ఈ వీకెండ్ టిల్లు బెస్ట్ ఆప్షన్.

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. గత కొన్నేళ్ల సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్న రౌడీ హీరో.. కనీసం ఈ మూవీతో అయినా సక్సెస్ అందుకుంటాడనుకుంటే నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కోసమైతే ఈ వీకెండ్‌లో మూవీ చూడొచ్చు.

ఆమిర్ ఖాన్ నిర్మాతగా, అతడి మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'లా పతా లేడీస్'. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, తన భార్య మిస్ కావడంతో మరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీశారు. గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఇది కూడా మంచి కామెడీ చిత్రమే. ఈ వీకెండ్ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్ కావాలంటే దీనిపైన కూడా ఓ లుక్కేసేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement