ఓటీటీలో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్‌ | Eleven Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీలో క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్‌

Jun 9 2025 7:07 AM | Updated on Jun 9 2025 9:33 AM

Eleven Movie OTT Streaming Date Locked

క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ 'లెవన్‌' (Eleven) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. నవీన్‌ చంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ వర్షన్‌లో మే 16న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీని లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ మూవీలో అభిరామి, రవి వర్మ కీలక పాత్రలు చేశారు. ఏఆర్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ బ్యానర్‌పై అజ్మల్‌ ఖాన్, రేయా హరి నిర్మించారు.

'ఆహా' (Aha) వేదికగా ఈ నెల 13 నుంచి 'లెవన్‌' మూవీ  స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఐఎమ్‌డిబి రేటింగ్‌లో కూడా ఈ చిత్రం 7.9 సాధించింది. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారికి లెవన్‌ తప్పకుండా నచ్చుతుందని నెటిజన్లు చెబుతున్నారు. కథలో సీరియల్‌ కిల్లింగ్స్‌ జరుగుతూ ఉంటే వాటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్లాన్‌ వేశారు అనేది మూవీలో చక్కగా చూపారు.

'లెవన్‌' కథేంటంటే.. 
అరవింద్‌(నవీన్‌ చంద్ర) ) ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్‌ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్‌ కుమార్‌ (శశాంక్‌) డీల్‌ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్‌ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్‌ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్‌ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్‌ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్‌ ఈ కేసును ఎలా డీల్‌ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement