దర్శకుడు క్రిష్‌కు కరోనా..‌ | Director Krish Tested Positive For Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా బారిన పడిన దర్శకుడు క్రిష్‌

Jan 2 2021 7:45 PM | Updated on Jan 2 2021 8:37 PM

Director Krish Tested Positive For Coronavirus - Sakshi

తెలుగు సినీ ఇండస్ట్రీని కరోనా వైరస్‌ వెంటాడుతోంది. ఇటీవల హీరో రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ జాబితాలోకి దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి కూడా చేరిపోయాడు. తాజాగా డైరెక్టర్‌ క్రిష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. క్రిష్‌ ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను జనవరి 4న తిరిగి ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాడు.  ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చదవండి: విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత

ఈ క్రమంలో సోమవారం నుంచి షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్రకారం క్రిష్ ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. అందులో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంట‌నే క్రిష్‌ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో షూటింగ్‌ వాయిదా పడింది. ఇటీవ‌లే వకీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వరలోనే క్రిష్‌ మూవీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే క్రిష్‌కు కరోనా అని తేలడంతో అతను కోలుకున్న అనంతరం పవన్‌ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉండగా ప‌వ‌న్, వ‌కీల్ సాబ్ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో క్రిష్.. వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ మూవీని తెర‌కెక్కించారు. 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేశాడు క్రిష్. చదవండి: అనుకోని అతిథి.. షాక్‌ అయిన సూపర్‌ స్టార్‌

Advertisement
 
Advertisement
Advertisement