అనుకోని అతిథి.. షాక్‌ అయిన అక్షయ్‌

Akshay Kumar Search Phone Charging Point Leads Him To a Frog In Socket - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. దీంతో ఆ అతిథిని చూసి షాక్‌ అయిన అక్కీ ఈ విషయాన్ని తన అభిమానులతో సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తన ఫోన్‌ చార్జింగ్‌ పెట్టుకునేందుకు సాకెట్‌ దగ్గరికి వెళ్లిన ఆయనకు ఎలక్ట్రిక్ సాకెట్‌లో కప్ప కనిపించింది. దీంతో అది అక్కడకు ఎలా వెళ్లిందాని షాక్‌ అవుతూ అక్షయ్ సాకెట్‌లో ఉన్న ఆ కప్ప ఫొటోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘నేను నా ఫోన్‌ చార్జింగ్‌ కోసం సాకెట్‌ దగ్గరకు వెళ్లి చూడగా నాకు మరొకటి కనిపించింది. చూస్తుంటే అది ఆ ప్లేస్‌ను ఆక్రమించినట్టుంది’ అంటూ అక్షయ్‌ సరదాగా పోస్ట్‌ చేశాడు. ఇక అది చూసిన మోడల్‌, నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం ‘దానికి రెంట్‌ వసూలు చేస్తున్నారా’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. (చదవండి: ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!)

కాగా అక్షయ్‌ నటించిన ‘లక్ష్మి’ సినిమా గతేడాది నవంబర్‌లో డిస్నీ హట్‌స్టార్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ట్రాన్స్‌జెండర్‌గా అక్షయ్‌ తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఇక అక్షయ్‌ నటించిన ‘బెల్‌బాటమ్’‌, ‘బచ్చన్‌ పాండే’, ‘సూర్యవంశీ’ సినిమాలు విడుదల కావాల్సి ఉండగా.. ‘రక్షబంధన్’‌, ‘పృథ్వీరాజ్’‌ చిత్రాలు చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటున్నాయి. ఈ తరుణంలో ‘అట్రాంగి రే’ అనే మరో కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల అక్షయ్‌ ప్రకటించి సంగతి తెలిసిందే. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తమిళ సూపర్‌ స్టార్‌ హీరో ధనుష్‌, సారా అలీ ఖాన్‌లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. (చదవండి: మిషన్‌ మంగళ్‌ జోడి మరోసారి!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top