ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!

Akshay Kumar to Charge Rs 135 Crores Per Film in 2022 - Sakshi

బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా కొనసాగుతున్నారు ఖిలాడీ హీరో అక్షయ్‌ కుమార్‌. స్టార్‌‌ హీరోలందరూ ఏడాదికి ఒక‍్క సినిమా విడుదల చేయ్యడమే గగనంగా భావిస్తుంటే.. అక్షయ్‌ మాత్రం మూడు, నాలుగు సినిమాలు సునాయసంగా చేస్తారు. పైగా ఆయన సినిమాలకు సక్సెస్‌ రేటు ఎక్కువ. అక్షయ్‌ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ సినిమాలు అనే భావన దర్శక నిర్మాతల్లో ఉంది. ఇక రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా అక్షయ్‌ టాప్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 117 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అక్షయ్‌ మరోసారి తన రెమ్యూనరేషన్‌ని పెంచనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2022లో చేయబోయే చిత్రాల కోసం అక్షయ్‌ ఏకంగా 135 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకోనున్నట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: అత్తకు ప్రశంసలు.. అల్లుడి ఆనందం)

దీని గురించి ఓ సినీ విశ్లేషకుడు మాట్లాడుతూ.. ‘అక్షయ్‌ సినిమాల శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ కోసం 80-90 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రొడక్షన్‌ బడ్జెట్‌ వచ్చి 35-45 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక ప్రింట్‌, పబ్లిసిటీ కోసం మరో 15 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక రెమ్యూనరేషన్‌ కాకుండా అక్షయ్‌ సినిమా ఒవర్‌ ఆల్‌ బడ్జెట్‌ చూసుకుంటే 185-200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక ప్రతి సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మినిమం గ్యారంటీగా నిలుస్తూ.. సుమారు 500 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తోంది. దాంతో‌ తన రెమ్యూనరేషన్‌ని భారీగా పెంచారు. ఇక అక్షయ్‌ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు కూడా ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి అంగీకరిస్తున్నారు’ అన్నారు. ఇక ప్రస్తుతం అక్షయ్‌ చేతిలో సూర్యవంశి, అత్రాంగి రే, బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, పృథ్వీరాజ్, రామ్ సేతు వంటి సినిమాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top