విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత | Tamil Producer K Balu Passed Away in Chennai,Industry Mourns | Sakshi
Sakshi News home page

విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత

Jan 2 2021 7:27 PM | Updated on Jan 3 2021 12:12 PM

Tamil Producer K Balu Passed Away in Chennai,Industry Mourns - Sakshi

చెన్నై : 2021 ఏడాది ప్రారంభంలోనే తమిళనాడు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కే బాలు అకాల మరణం చెందారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే బాలుకి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కూడా తెలుస్తోంది. కేపీ ఫిల్మ్స్‌ను స్థాపించిన బాలు ఎన్నో సూపర్‌ హింట్‌ సినిమాలను అందించిన ఘనత దక్కించుకున్నారు. కోలీవుడ్‌కు చెందిన బాలు ‘చిన్న తంబీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 1991లో విడుదలైన ఈ సినిమాలో ప్రభు, ఖుష్బూ హరో హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే(సౌత్‌).. విన్నర్స్‌ జాబితా

నిర్మాత మరణ వార్తను నటుడు ఆర్‌ శరత్‌ కుమార్‌ ట్విటర్‌ ద్వారా  ద్వారా వెల్లడించారు. బాలు అకాల మరణం షాక్‌కు గురి చేసిందని, ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు అని అ‍న్నారు. తమిళ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న కే బాలు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమిళ పరిశ్రమ తరపున బాలు కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి ప్రకటించారు. బాలు అంత్యక్రియలు శనివారం చైన్నైలోని బెసంట్‌‌ నగర్‌లో నిర్వహించారు. చదవండి: రహస్యంగా పెళ్లి; పాపకు జన్మనిచ్చిన నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement