దాదాసాహెబ్ ఫాల్కే(సౌత్‌).. యువ హీరోకు అవార్డు

Dadasaheb Phalke South Awards 2020 Winners List - Sakshi

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తాజాగా 2020 ఏడాదికిగాను దాదా సాహెబ్‌ ఫాల్కే సౌత్‌ అవార్డుల జాబితాను ప్రకటించారు. సౌత్‌లోని నాలుగు సినీ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ) పరిశ్రమ రంగాలు అవార్డులు అందుకున్నాయ. ఈ క్రమంలో టాలీవుడ్‌కు సంబంధించిన ఆరు కెటగిరిల్లో అవార్డులు వరించాయి. యువ నటుడు నవీన్ పోలిశెట్టి సౌత్ కేటగిరీలో ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నందుకు గానూ నవీన్‌కు ఈ అవార్డు వరించింది. ఇక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 

‘డియర్ కామ్రేడ్’లో అద్భుతమైన నటన ప్రదర్శించిన రష్మిక మందన్న ఉత్తమ నటి అవార్డును దక్కించుకుంది. ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్‌ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’కు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సుజీత్ ఉత్తమ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. అలాగే ‘అల వైకుంఠపురములో’ వంటి మ్యూజికల్ హిట్‌తో సంగీత ప్రియులను ఆకట్టుకున్న ఎస్ఎస్ తమన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ కింగ్  అక్కినేని నాగార్జునకు ఈ ఏడాది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా హిందీకి సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 ప్రదానోత్సవాన్ని ఫిబ్రవరి 20 ముంబైలోని తాజ్ లాండ్స్ ఎండ్‌లో జరుపుబోతున్నారు. సౌతిండియా అవార్డుల ప్రదానోత్సవం తేదీని అతి త్వరలో తెలుపనున్నారు.

కోలీవుడ్‌ నుంచి..
మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్‌- అజిత్‌ కుమార్‌
ఉత్తమ నటుడు- ధనుష్‌
ఉత్తమ నటి- జ్యోతిక
ఉత్తమ దర్శకుడు- పార్థిబాన్‌
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌- అనురుద్ద్‌ రవిచంద్రన్‌

మాలీవుడ్‌ నుంచి
మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-మోహన్‌ లాల్
ఉత్తమ నటుడు -సూరజ్ వెంజరమూడు
ఉత్తమ నటి- పార్వతీ తిరువోతు
ఉత్తమ దర్శకుడు- మధు కె. నారాయణ్
ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌-  దీపక్ దేవ్

శాండల్‌వుడ్‌ నుంచి
మోస్ట్ వర్సిటైల్ ఆర్టిస్ట్-శివరాజ్‌కుమార్‌
ఉత్తమ నటుడు - రక్షిత్ శెట్టి
ఉత్తమ నటి- తాన్య హోప్
ఉత్తమ దర్శకుడు- రమేష్ ఇందిరా
ఉత్తమ చిత్రం‌-  మూకాజ్జియ కనసుగలు
ఉత్తమ సంగీత దర్శకుడు- వి. హరికృష్ణ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top