ఇప్పట్లో అయ్యేలా లేదే.. ఎనిమిదేళ్లయినా లభించని మోక్షం..! | Dhruva Natchathiram Gautham Menon seeks 30 days extension from court | Sakshi
Sakshi News home page

Dhruva Natchathiram: ఇప్పట్లో అయ్యేలా లేదే.. ఎనిమిదేళ్లయినా లభించని మోక్షం..!

Jun 15 2026 3:32 PM | Updated on Jun 15 2026 3:47 PM

Dhruva Natchathiram Gautham Menon seeks 30 days extension from court

కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్‌ ధృవ నక్షత్రం. 2018లో మొదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్‌కు నోచుకోలేదు. ఇటీవలే జూన్ 15 లోపు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చని కోర్టు కూడా చెప్పింది. కానీ అలా జరగలేదు. ఈ సినిమా విడుదలకు మరింత సమయం కావాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  సినిమా విడుదలకు అదనంగా 30 రోజులు కావాలని అభ్యర్థించారు.  

దీంతో ధృవ నక్షత్రం ఇప్పుడే రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లే కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి మరింత టైమ్ కావాలని దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ హైకర్ట్‌ను కోరారు. ఈ మూవీ రిలీజ్‌కు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జూన్ 15, 2026 లోపు థియేటర్లలోకి తీసుకురావడం తన వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. 

కాగా.. ఈ సినిమాకు సంబంధించిన అన్ని లావాదేవీలు 'కొండడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్' పేరుతో నిర్వహించే ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారానే జరగాలని.. అలాగే కోర్టు నియమించిన పరిశీలకులు ప్రతి ఆర్థిక లావాదేవీని పర్యవేక్షించాలని గత ఉత్తర్వుల్లో ఆదేశించింది. నిర్ణీత గడువులోగా సినిమాను విడుదల చేయలేకపోతే, అదనపు సమయం కోరే స్వేచ్ఛను కూడా కోర్టు మీనన్‌కు కల్పించింది.

కాగా.. ఈ చిత్రంలో విక్రమ్‌తో పాటు రితూ వర్మ, వినాయకన్, ఆర్. పార్థిబన్, సిమ్రాన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. 2017లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. అప్పటి నుంచి ఆర్థిక సమస్యలు, న్యాయపరమైన అడ్డంకులతో 2023లో షూటింగ్ పూర్తయింది. నవంబర్ 2023లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ.. ఆర్థిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేశారు. తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరింత అదనపు సమయం కోరడంతో రిలీజ్ మరింత ఆలస్యం కానుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement