'Dhimahi' Movie First Look Poster Launched - Sakshi
Sakshi News home page

ధీమహి చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Aug 7 2023 6:50 PM | Updated on Aug 9 2023 3:25 PM

Dhimahi Movie First Look Poster Launch - Sakshi

కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ పతాకంపై 7:11PM  చిత్రం ఫేమ్ సాహస్ పగడాల హీరోగా నటించిన సినిమా 'ధీమహి'. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులు. ఇందులో నిఖిత చోప్రా హీరోయిన్. షారోన్ రవి సంగీతం అందించారు. షూటింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని  విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. 

(ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్‌ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు)

అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ 'ధీమహి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. 7:11 చిత్రంలో నటించిన సాహస్ పగడాల ఈ చిత్రంలో నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారు. ఇది ఒక థ్రిల్లర్ చిత్రం. షూటింగ్,  నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. మా చిత్రంలోని పాటలను త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తాము.  ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నాము. సినిమా చాలా కొత్తగా ఉంటుంది, త్వరలోనే ట్రైలర్‌తో మీముందుకు వస్తాం. ఆపై రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తాం.' అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement