‘దీవాన’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Deewana Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘దీవాన’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Jun 20 2026 7:10 AM | Updated on Jun 20 2026 11:21 AM

Deewana Movie Review And Rating In Telugu

టైటిల్‌: దీవాన
నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, నరేశ్‌, ఝాన్సీ తదితరులు
నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
దర్శకత్వం: శ్రీకాంత్‌ సంగిశెట్టి
సంగీతం: ఈశ్వర్‌ చంద్‌
సినిమాటోగ్రఫీ: శంశీ పచ్చిపులుసు
ఎడిటర్: హృషికేశ్ పాస్పల్
విడుదల తేది: జూన్‌ 19, 2026

హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఘలై జంటగా నటించిన ‘దీవాన’చిత్రాన్ని శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించారు. ఈ మూవీని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ అయింది. మరి ఈ ప్రేమ కథా చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది.. హర్షిత్ రెడ్డికి మంచి విజయం దక్కిందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

కథ ఏంటంటే?
డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డిద) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం, తాగడం తప్పా ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు. తండ్రి శేఖర్(నరేష్) పడే కష్టం గురించి మున్నా ఏ మాత్రం ఆలోచించడు. అసలు తల్లిదండ్రులు, ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓ సారి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పని చేస్తుంటుందని, ఆమె పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై) అని తెలుసుకుంటాడు. ఇక ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని అమూల్య వద్దకు వెళ్లడం చేస్తుంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేష్టలకు అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి రూ. 20 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు మాత్రం రూ. 20  కూడా సంపాదించలేవు.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో అమూల్య చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి ఓ కండీషన్ ఎందుకు పెట్టింది? మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే ఆ కారణాలు ఏంటి? చివరకు మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ప్రేమ కథల్ని ఎలా అయినా తీయొచ్చు.. ప్రేమలో ఎన్ని సంఘర్షణలైనా పెట్టొచ్చు.. కుల మతాలు, డబ్బు, హోదా, అధికారం ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పి ప్రేమ కథల్ని అందంగా తెరపై ఆవిష్కరించొచ్చు. అయితే దీవాన కోసం దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి తీసుకున్న పాయింట్, చూపించిన ఎమోషన్స్, కాన్ ఫ్లిక్ట్ చాలా కొత్తగా, హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. ఇది కదా అసలు సిసలు ప్రేమ.. ఇది కదా ప్రేమకు నిర్వచనం అని అనిపించేలా సినిమాని ఎండ్ చేస్తాడు. ఓ చక్కటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించడంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు.

ఫస్టాఫ్‌ ప్రారంభం అంతా కూడా గందరగోళంగా, నిరాసక్తంగా సాగుతుంది. కానీ కథలోని కాన్ ఫ్లిక్ట్ ఒక్కసారి అర్థమయ్యాక.. సినిమా టోన్ మారుతుంది. హీరో అల్లరి వేషాలు, వీధి గొడవలు, స్నేహితులతో కలిసి గాలికి తిరగడం, ప్రేమ అంటూ వెంటపడే సన్నివేశాలు ఇవన్నీ చాలా రొటీన్‌గానే అనిపిస్తాయి. ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్లాక్ రివీల్ అవుతుందో.. ఆడియెన్స్‌లో ఓ ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. అరెరె ఇంత వరకు సినిమాని తప్పుగా అనుకున్నామే.. ఇకపై అద్భుతంగా ఉంటుందేమో అని అనుకునేలా చేస్తాడు దర్శకుడు.

ద్వితీయార్దం చాలా వరకు ఎమోషనల్‌గానే నడిపించాడు. మధ్యలో కొన్ని ఇల్లాజికల్ సీన్లు కూడా వస్తాయి. ఒక్క పాటలో హీరో కోచింగ్ తీసుకోవడం, ఎస్సై పరీక్షలో చివరి దశకు చేరుకోవడం ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవాల్సిందే. తండ్రి గొప్పదనాన్ని వివరించే సీన్, హీరోయిన్ తన ప్రేమను బయట పెట్టే సీన్ ఇలా చాలా వరకు కంటతడి పెట్టించేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు గుండెను మెలిపెట్టేలా సాగుతుంది. చివరకు ఓ చక్కటి ప్రేమ కథా చిత్రాన్ని చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే..
ఆవారాలా గాలికి తిరిగే కుర్రాడిలా హర్షిత్ రెడ్డి మెప్పిస్తాడు. ఫస్టాఫ్‌లోని హర్షిత్‌కి సెకండాఫ్‌లో బాధ్యతాయుతంగా ప్రవర్తించే హర్షిత్‌కి తేడా కనిపిస్తుంది. ఎమోషనల్‌ సీన్లతో హర్షిత్ అందరినీ ఏడ్పించేస్తాడు. హీరోయిన్‌కి మంచి స్కోప్ ఉన్న గొప్ప పాత్ర లభించింది. నరేష్ మరోసారి తన నటనతో అందరినీ కంటతడి పెట్టించేస్తాడు. ఝాన్సీ పాత్ర రెగ్యులర్ మదర్‌లానే అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. వేణు, రఘు పాత్రలు బాగుంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.

సాంకేతికంగా చూసుకుంటే..‘దీవాన’ విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. పాటలు సందర్భోచితంగా వస్తాయి. మాటలు గుండెల్ని తాకుతాయి. బీజీఎం చాలా వరకు హాంటింగ్‌గా ఉంటుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లోనే ఓ మంచి చిత్రాన్ని నిర్మించి.. తమ నిర్మాణ విలువల్ని చాటుకున్నారు మేకర్స్. హానెస్ట్ స్టోరీతో వచ్చిన ‘దీవాన’ యూత్ ప్రేక్షకుల్ని, ప్రేమ కథల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అవకాశం ఉంది.

Rating:
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement