breaking news
Deewana Movie
-
ఓటీటీలోకి గుండెల్ని పిండేసే లవ్‌స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన తాజా చిత్రం ‘దీవాన’. ఈ చిత్రంలోన బ్యూటిఫుల్ హీరోయిన్ స్మేహ మణిమేఘలై తెలుగు తెరకు పరిచయం అయింది. శ్రీకాంత్ సంఘిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 20న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్‌ని అందుకుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేస్తాయి. అంతగా ఆకట్టుకున్న ఈ ప్రేమ కథ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.ఈ జులై 31వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. 'మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్' అంటూ మేకర్స్ ఈ రోజు ‘దీవాన’ ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఎర్లీ యాక్సెస్ లో ఈ సినిమాను చూడొచ్చు. తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమా వ్యూయర్స్ కు అందుబాటులో ఉండనుంది.‘దీవాన’ కథేంటంటే.. డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డిద) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం, తాగడం తప్పా ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు. తండ్రి శేఖర్(నరేష్) పడే కష్టం గురించి మున్నా ఏ మాత్రం ఆలోచించడు. అసలు తల్లిదండ్రులు, ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓ సారి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పని చేస్తుంటుందని, ఆమె పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై) అని తెలుసుకుంటాడు. ఇక ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని అమూల్య వద్దకు వెళ్లడం చేస్తుంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేష్టలకు అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి రూ. 20 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు మాత్రం రూ. 20 కూడా సంపాదించలేవు.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో అమూల్య చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి ఓ కండీషన్ ఎందుకు పెట్టింది? మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే ఆ కారణాలు ఏంటి? చివరకు మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘దీవాన’ సినిమా థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
లైఫ్ గురించి డెప్త్ ఉన్న స్టోరీ ఇది
‘‘దీవాన’ చూశాను... బాగుంది. ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్‌ని నేను చూడలేదు. ఇలా ఎందుకు చేశాడని దర్శకుడిపై నాకు కోపం వచ్చింది. సినిమాలోని క్యారెక్టర్స్‌పై ప్రేమ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంది. ‘దీవాన’ లవ్‌స్టోరీ మాత్రమే కాదు. లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఇది యూత్ ఫిల్మ్ అనుకుంటాం కానీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఒకవేళ మీ టైమ్ వృథా అయ్యిందని అనిపిస్తే చెప్పండి... నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా’’ అని శ్రీవిష్ణు అన్నారు. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన సినిమా ‘దీవాన’.శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శుక్రవారం జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్‌కు అతిథిగా హాజరైన శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘నా వంతుగా ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్‌కి తీసుకెళ్లండి, లేదా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి. అది ‘దీవాన’ సినిమాకు బూస్ట్ ఇస్తుంది. ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నాను’’ అని అన్నారు. హర్షిత్ మాట్లాడుతూ–‘‘మా సినిమా ఫస్ట్ వీక్ తర్వాత కూడా థియేటర్స్‌లో 70 శాతం ఆక్యుపెన్సీతో ఉండడం నిజమైన సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఏ భాషలో రాని సినిమా ఇది’’ అన్నారు శ్రీకాంత్. ‘‘ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మంచి సినిమా చేశాం’’ అన్నారు శ్రీదేవి కార్యంపూడి. ‘‘ఇప్పట్లో మా ‘దీవాన’ సినిమా ఓటీటీకి రాదు. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే’’ అన్నారు వాసుదేవ్. -
మా క్రియేటివిటీని చంపుతున్నారు: డైరెక్టర్ శ్రీకాంత్ ఆవేదన
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్‌కు కూడా వస్తోంది. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు.హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. సింగిల్ స్క్రీన్స్‌లో వంద రూపాయలే టికెట్ నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది' అని అన్నారు. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ కీలక పాత్రలు పోషించారు. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ఈ వారం హిట్ బొమ్మ ఏది?
ఈ వారం టాలీవుడ్లో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో పాటు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’కూడా ఉంది. వీటితో పాటు యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన లవ్‌స్టోరీ ‘దీవాన’, ‘బిచ్చగాడు’ఫేం విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’, మలయాళ మూవీ ‘బాలన్-ది బాయ్’ సినిమాలు కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల కథేంటి? ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి? పూర్తి రివ్యూస్‌ని ఒక్క క్లిక్‌తో చదివేయండి.1) ‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘దీవాన’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘దీవాన’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: దీవాననటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, నరేశ్, ఝాన్సీ తదితరులునిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడిదర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టిసంగీతం: ఈశ్వర్ చంద్సినిమాటోగ్రఫీ: శంశీ పచ్చిపులుసుఎడిటర్: హృషికేశ్ పాస్పల్విడుదల తేది: జూన్ 19, 2026హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఘలై జంటగా నటించిన ‘దీవాన’చిత్రాన్ని శ్రీకాంత్ సంఘిశెట్టి తెరకెక్కించారు. ఈ మూవీని అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ అయింది. మరి ఈ ప్రేమ కథా చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది.. హర్షిత్ రెడ్డికి మంచి విజయం దక్కిందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.కథ ఏంటంటే?డిగ్రీ పూర్తి చేసిన మున్నా (హర్షిత్ రెడ్డిద) ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడం, తాగడం తప్పా ఇంటి బాధ్యతల్ని పట్టించుకోడు. తండ్రి శేఖర్(నరేష్) పడే కష్టం గురించి మున్నా ఏ మాత్రం ఆలోచించడు. అసలు తల్లిదండ్రులు, ఇంటి బాధ్యత అన్నదే మున్నాకి పట్టదు. ఎప్పుడూ గాలి తిరుగుడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి మున్నా ఓ సారి ఓ అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇక ఆ అమ్మాయి మీ సేవా కేంద్రంలో పని చేస్తుంటుందని, ఆమె పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై) అని తెలుసుకుంటాడు. ఇక ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని అమూల్య వద్దకు వెళ్లడం చేస్తుంటాడు మున్నా. అయితే కొన్ని రోజులకు మున్నా చేష్టలకు అమూల్య విసిగిపోతుంది. నేను నెలకి రూ. 20 వేలు సంపాదిస్తున్నా.. నువ్వు మాత్రం రూ. 20 కూడా సంపాదించలేవు.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో అమూల్య చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి ఓ కండీషన్ ఎందుకు పెట్టింది? మరి మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే ఆ కారణాలు ఏంటి? చివరకు మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ప్రేమ కథల్ని ఎలా అయినా తీయొచ్చు.. ప్రేమలో ఎన్ని సంఘర్షణలైనా పెట్టొచ్చు.. కుల మతాలు, డబ్బు, హోదా, అధికారం ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పి ప్రేమ కథల్ని అందంగా తెరపై ఆవిష్కరించొచ్చు. అయితే దీవాన కోసం దర్శకుడు శ్రీకాంత్ సంఘిశెట్టి తీసుకున్న పాయింట్, చూపించిన ఎమోషన్స్, కాన్ ఫ్లిక్ట్ చాలా కొత్తగా, హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. ఇది కదా అసలు సిసలు ప్రేమ.. ఇది కదా ప్రేమకు నిర్వచనం అని అనిపించేలా సినిమాని ఎండ్ చేస్తాడు. ఓ చక్కటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించడంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడు.ఫస్టాఫ్ ప్రారంభం అంతా కూడా గందరగోళంగా, నిరాసక్తంగా సాగుతుంది. కానీ కథలోని కాన్ ఫ్లిక్ట్ ఒక్కసారి అర్థమయ్యాక.. సినిమా టోన్ మారుతుంది. హీరో అల్లరి వేషాలు, వీధి గొడవలు, స్నేహితులతో కలిసి గాలికి తిరగడం, ప్రేమ అంటూ వెంటపడే సన్నివేశాలు ఇవన్నీ చాలా రొటీన్‌గానే అనిపిస్తాయి. ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్లాక్ రివీల్ అవుతుందో.. ఆడియెన్స్‌లో ఓ ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. అరెరె ఇంత వరకు సినిమాని తప్పుగా అనుకున్నామే.. ఇకపై అద్భుతంగా ఉంటుందేమో అని అనుకునేలా చేస్తాడు దర్శకుడు.ద్వితీయార్దం చాలా వరకు ఎమోషనల్‌గానే నడిపించాడు. మధ్యలో కొన్ని ఇల్లాజికల్ సీన్లు కూడా వస్తాయి. ఒక్క పాటలో హీరో కోచింగ్ తీసుకోవడం, ఎస్సై పరీక్షలో చివరి దశకు చేరుకోవడం ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవాల్సిందే. తండ్రి గొప్పదనాన్ని వివరించే సీన్, హీరోయిన్ తన ప్రేమను బయట పెట్టే సీన్ ఇలా చాలా వరకు కంటతడి పెట్టించేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు గుండెను మెలిపెట్టేలా సాగుతుంది. చివరకు ఓ చక్కటి ప్రేమ కథా చిత్రాన్ని చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..ఆవారాలా గాలికి తిరిగే కుర్రాడిలా హర్షిత్ రెడ్డి మెప్పిస్తాడు. ఫస్టాఫ్‌లోని హర్షిత్‌కి సెకండాఫ్‌లో బాధ్యతాయుతంగా ప్రవర్తించే హర్షిత్‌కి తేడా కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్లతో హర్షిత్ అందరినీ ఏడ్పించేస్తాడు. హీరోయిన్‌కి మంచి స్కోప్ ఉన్న గొప్ప పాత్ర లభించింది. నరేష్ మరోసారి తన నటనతో అందరినీ కంటతడి పెట్టించేస్తాడు. ఝాన్సీ పాత్ర రెగ్యులర్ మదర్లానే అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. వేణు, రఘు పాత్రలు బాగుంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా చూసుకుంటే..‘దీవాన’ విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. పాటలు సందర్భోచితంగా వస్తాయి. మాటలు గుండెల్ని తాకుతాయి. బీజీఎం చాలా వరకు హాంటింగ్‌గా ఉంటుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంటుంది. తక్కువ బడ్జెట్లోనే ఓ మంచి చిత్రాన్ని నిర్మించి.. తమ నిర్మాణ విలువల్ని చాటుకున్నారు మేకర్స్. హానెస్ట్ స్టోరీతో వచ్చిన ‘దీవాన’ యూత్ ప్రేక్షకుల్ని, ప్రేమ కథల్ని ఇష్టపడే ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అవకాశం ఉంది. -
పవన్‌కు‘తొలిప్రేమ.. నాకు ‘దీవాన’: యంగ్ హీరో హర్షిత్ రెడ్డి
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ - దీవాన కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఈ సినిమా మీరు చూశాక ఈ పాయింట్ ను స్క్రీన్ ప్లే చేసి సినిమాగాచూపించవచ్చా అనుకుంటారు. ఎంతో ధైర్యంగా వాసు, శ్రీదేవి ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని మున్నా మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని లైఫ్ ను, అతని జర్నీ చూస్తారు. చివరలో మీ మనసును కదిలిస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఈ చిత్రంలో చూస్తారు. మీ మనసులో ఒక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘ నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు నేచర్ బాగా సపోర్ట్ చేస్తోంది. రెండేళ్లు షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ఏమేం కావాలో అన్నీ అలా కలిసివచ్చేవి. హీరోయిన్ లేకుండానే సగం సినిమా షూటింగ్ చేశాం. మంచి హీరోయిన్ వస్తుందనే నమ్మకం మాలో ఉండేది. మా డైరెక్టర్ సినిమా విషయంలో దీవాన. ఒక్క సీన్ బాగా రాకున్నా ఆయన టెన్షన్ పడేవారు. కమల్ హాసన్ గారికి సద్మా, నాగార్జున గారికి గీతాంజలి, పవన్ గారికి తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ హర్షిత్ కు దీవాన అలా పేరు తెస్తుంది’ అన్నారు. సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.


