పవన్‌కు‘తొలిప్రేమ.. నాకు ‘దీవాన’: యంగ్‌ హీరో హర్షిత్‌ రెడ్డి | Samantha Released Idi Prema Song Deewana, Harshith Reddy Emotional Words | Sakshi
Sakshi News home page

పవన్‌కు‘తొలిప్రేమ.. నాకు ‘దీవాన’: యంగ్‌ హీరో హర్షిత్‌ రెడ్డి

Mar 24 2026 4:14 PM | Updated on Mar 24 2026 4:32 PM

Samantha Released Idi Prema Song Deewana, Harshith Reddy Emotional Words

సమంత చేతుల మీదుగా ‘దీవాన’ పాట రిలీజ్‌

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన". స్మేహ మణిమేగలై హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్నారు. "దీవాన" సినిమా ఈ వేసవికి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈరోజు ఈ చిత్రం నుంచి ఇది ప్రేమ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ - దీవాన కథ నా దగ్గర చాలా కాలంగా ఉంది. దీన్ని సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ఈ సినిమా మీరు చూశాక ఈ పాయింట్ ను స్క్రీన్ ప్లే చేసి సినిమాగాచూపించవచ్చా అనుకుంటారు. ఎంతో ధైర్యంగా వాసు, శ్రీదేవి ఈ మూవీ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని మున్నా మిడిల్ క్లాస్ అబ్బాయి. అతని లైఫ్ ను, అతని జర్నీ చూస్తారు. చివరలో మీ మనసును కదిలిస్తుంది. అంత బ్యూటిఫుల్ క్లైమాక్స్ ఈ చిత్రంలో చూస్తారు. మీ మనసులో ఒక స్థానం సంపాదించుకునే సినిమా అవుతుందని నమ్ముతున్నాం’ అన్నారు.

హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ‘ నేను షారుఖ్ ఖాన్ అభిమానిని. ఆయన మొదటి చిత్రం పేరు కూడా దీవాననే అని తెలుసుకున్న తర్వాత ఈ సినిమా నాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాకు నేచర్ బాగా సపోర్ట్ చేస్తోంది. రెండేళ్లు షూటింగ్ చేశాం. ఈ సినిమాకు ఏమేం కావాలో అన్నీ అలా కలిసివచ్చేవి. హీరోయిన్ లేకుండానే సగం సినిమా షూటింగ్ చేశాం. మంచి హీరోయిన్ వస్తుందనే నమ్మకం మాలో ఉండేది. మా డైరెక్టర్ సినిమా విషయంలో దీవాన. ఒక్క సీన్ బాగా రాకున్నా ఆయన టెన్షన్ పడేవారు. కమల్ హాసన్ గారికి సద్మా, నాగార్జున గారికి గీతాంజలి, పవన్ గారికి తొలి ప్రేమ, విజయ్ దేవరకొండ గారికి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ హర్షిత్ కు దీవాన అలా పేరు తెస్తుంది’ అన్నారు. సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకులు వెంకీ అట్లూరి, రవికిరణ్ కోలా, నందినీరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement