
గ్రామీణ పాటలను సినిమాకు పరిచయం చేసింది కళైవానర్ ఎన్‌ఎస్ కృష్ణన్ అని ప్రఖ్యాత చర్చా వేదిక వ్యాఖ్యాత దిండిగల్ లియోనీ తెలిపారు. మరుదమ్ నాట్టుపుర సంస్థ నిర్వాహకుడు ఎస్.జగన్నాథం నిర్మించిన చిత్రం 'డప్పాంకుత్తు'. ఎస్‌టీ గుణశేఖర్ కథ, కథనం, మాటలు అందించగా.. ఆర్.ముత్తువీరా దర్శకత్వం వహించారు. శంకరపాండి హీరోగా నటించిన ఈ సినిమాలో దీప్తి, దుర్గ హీరోయిన్స్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్)
15 గ్రామీణ పాటలు ఉన్న ఈ సినిమాకు రాజా కె భక్తవత్సలం సినిమాటోగ్రఫీ, శరవణన్ సంగీతమందించారు. గ్రామీణ కళాకారుల జీవన విధానాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం.. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
(ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి)