'జాను లిరి ఎవరో కూడా నాకు తెలియదు'.. అది తలచుకుంటే బాధేసింది! | Choreographer Sekhar Master Responds On Women Dancer Issue in Show | Sakshi
Sakshi News home page

Sekhar: జాను లిరిలో టాలెంట్‌ ఉందనే అభినందించా.. కానీ ఏదేదో రాసేశారు'

Apr 26 2025 12:51 PM | Updated on Apr 26 2025 1:32 PM

Choreographer Sekhar Master Responds On Women Dancer Issue in Show

టాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఇటీవల తన కొరియోగ్రఫీతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. డాకుమహారాజ్‌ దబిడి దిబిడి సాంగ్‌పై కూడా విమర్శలొచ్చాయి. ఆ తర్వాత మరో సాంగ్ విషయంలోనూ ఇదే జరిగింది. అలా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కాస్తా శృతి మించిపోయిందని చాలా మంది కామెంట్స్ చేశారు. ‍అలాగే ఆయన ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ షోలో జాను లిరిని అభినందించడంతో ఆయనపై పలు రూమర్స్ వచ్చాయి. 

వీరిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. ఈ విషయంపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో స్పందించారు. దీనిపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మహిళా డ్యాన్సర్‌ జాను విషయంలో తనని ఉద్దేశించి సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ ఎంతో బాధించాయని ఆయన తెలిపారు.

ఈ వివాదంపై జానీ మాస్టర్‌ మాట్లాడుతూ.. 'కొరియోగ్రాఫర్లకు పని విషయంలో ఒత్తిడి ఉంటుంది. అయితే టీవీ షోలకు విషయం అలా ఏం ఉండదు. ఒక షోలో జడ్జ్‌గా వ్యవహరించడం రిలాక్స్‌గానే ఉంటుంది. నేను ఆ సీట్‌లో కూర్చున్నప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి. అప్పుడు ఆ షోకు వచ్చిన వాళ్లలో ఆ అమ్మాయి బాగా చేసిందనిపించింది. అందుకే జాను బాగా చేశావని చెప్పా. దాన్ని పట్టుకుని జనాలు నేనేదో చేశానని అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి టాలెంట్‌ ఉంది కాబట్టే విన్నర్‌ అయింది.. అది జరిగిందక్కడ. 

దాన్ని కొంతమంది వేరుగా అర్థం చేసుకున్నారు. మా మధ్య ఏం లేదని మా యూనిట్ అందరికీ తెలుసు. అక్కడ ఏదైనా ఉంటే మీరు అనండి. అసలు ఆ షో తర్వాత అమ్మాయి ఎవరో కూడా తెలియదు. సోషల్‌మీడియాలో నా పోస్టులకు ఆమె గురించి కామెంట్స్‌ పెట్టేవారు. ఆ సమయంలో నేను ఎంతో బాధపడ్డా. ఆమెకు కుటుంబం ఉంది.. నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్‌ కాదు' అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో సైతం కొరియోగ్రాఫర్ల మధ్య ఎలాంటి గొడవలు లేవని శేఖర్ మాస్టర్‌ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement