విక్రమ్ భారీ బడ్జెట్‌ చిత్రం.. ట్రైలర్‌ రిలీజ్ ఎప్పుడంటే? | Chiyaan Vikram Latest Movie Thangalaan Trailer Release Date Out | Sakshi
Sakshi News home page

Thangalaan Trailer: విక్రమ్ తంగలాన్.. ట్రైలర్‌ రిలీజ్ ఎప్పుడంటే?

Jul 9 2024 8:03 AM | Updated on Jul 9 2024 9:38 AM

Chiyaan Vikram Latest Movie Thangalaan Trailer Release Date Out

కోలీవుడ్ స్టార్‌ హీరో విక్రమ్ నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్. ఈ పీరియాడికల్ యాక్షన్  మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో విక్రమ్ లుక్, నటన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది.

ఈ మూవీ ట్రైలర్‌ కోసం విక్రమ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈనెల 10న తంగలాన్ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ పా రంజిత్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

కాగా.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తంగలాన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో కబాలి, కాలా, సార్పట్ట చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ దర్శకత్వం వహిస్తుండగా.. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్‌లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement