హైదరాబాద్‌లో ఆరంభం | Chiranjeevi Mega158 Hyderabad Schedule Begins | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆరంభం

Jun 23 2026 12:21 AM | Updated on Jun 23 2026 12:21 AM

Chiranjeevi Mega158 Hyderabad Schedule Begins

‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్‌ రవీంద్ర) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘మెగా 158’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో నివేత పేతురాజ్, అనశ్వరా రాజన్  ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పొల్లాచ్చిలో జరిగింది.

చిరంజీవితో పాటుగా ప్రధాన తారాగణంపై కీలకమైన టాకీ పార్టుతో పాటుగా ఓ యాక్షన్  సీక్వెన్స్ ను చిత్రీకరించారని తెలిసింది. పొల్లాచ్చి షూట్‌ షెడ్యూల్‌ ఈ నెల 11న ముగిసింది. కాగా, ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయినట్లు చిత్రయూనిట్‌ పేర్కొని, షూటింగ్‌కి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.

తండ్రీ కూతుళ్ల ఎమోషన్  నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని, చిరంజీవి క్యారెక్టరైజేషన్ లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. ఈ సినిమా ప్రధాన కథాంశం కలకత్తా నేపథ్యంతో సాగుతుందట. ఈ మూవీకి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్  పతాకంపై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్  సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్నది చిత్రయూనిట్‌ ప్లాన్ . 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement