వినోదాల బాలరాజు  | Sakshi
Sakshi News home page

వినోదాల బాలరాజు 

Published Tue, Jan 23 2024 12:49 AM

Bootcut Balaraju Trailer Launch - Sakshi

సోహైల్‌ టైటిల్‌ రోల్‌ చేసిన సినిమా ‘బూట్‌కట్‌ బాలరాజు’. శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సోహైల్‌ మాట్లాడుతూ– ‘‘నేను షార్ట్‌ఫిల్మ్‌ నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను.

హీరో వెంకటేశ్‌గారికి మా సినిమా గురించి మెసేజ్‌ చేశాను. ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ, వాయిస్‌ మెసేజ్‌ పంపారు. అంత పెద్ద హీరో రిప్లయ్‌ ఇవ్వడం ధైర్యాన్నిచ్చింది. నాలాంటి యంగ్‌ స్టర్స్‌ ఇలాంటి సపోర్ట్‌ ఆశిస్తారు. పాషాగారు హార్డ్‌వర్క్‌ చేసి, ఈ సినిమా తీశారు’’ అన్నారు. ‘‘వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు శ్రీ కోనేటి.

Advertisement
 
Advertisement
 
Advertisement