
టాలీవుడ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. ఈ షో తొమ్మిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సారి రణరంగమే అంటూ నాగార్జున ఇప్పటికే అంచనాలు పెంచేశారు. కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్స్ను సెలెక్ట్ చేసేందుకు అగ్నిపరీక్ష అంటూ ఇప్పటికే ప్రోమోను రిలీజ్ చేశారు. దాదాపుగా 40 మందిని ఫైనలైజ్ చేసిన వీరికి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఈ పరీక్షలో నెగ్గినవారే షోలో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టనున్నారు.
ఈ ప్రాసెస్ నడుస్తుండగానే బిగ్బాస్ మేకర్స్ మరో ప్రోమోను రిలీజ్ చేశారు. బిగ్ బాస్ కమింగ్ సూన్ అంటూ టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్తో జరిగిన సరదా సంభాషణ ఆడియన్స్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బిగ్బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి వచ్చావా? అంటూ నాగార్జున అడగ్గా.. కాదు.. ఏలడానికి వచ్చాను అంటూ వెన్నెల కిశోర్ అంటారు. అది నీవల్ల కాదులే.. ఈసారి వెరీ టఫ్ అని నాగార్జున అనడంతో.. నేను చాలా రఫ్ అని చెప్తాడు.
(ఇది చదవండి: 40 మంది సామాన్యుల ఎంపిక.. హాట్‌స్టార్‌లో 'బిగ్‌బాస్' అగ్నిపరీక్ష)
ఈ సారీ బిగ్‌బాస్ డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ వెన్నెల కిశోర్‌కు నాగార్జున చిన్న ఝలక్ ఇస్తాడు. ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా? అంటూ వెన్నెల కిషోర్‌ను నాగార్జున ప్రశ్నిస్తాడు. నేను డైరెక్ట్గా బిగ్బాస్తోనే మాట్లాడుకుంటానని వెన్నెల కిశోర్ చెప్పడంతో.. ఈసారీ ఏకంగా బిగ్బాస్నే మార్చేశా అంటూ మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. అందరి సరదాలు తీరిపోతాయి.. ఈ సారీ చదరంగం కాదు.. రణరంగమే.. అనే డైలాగ్లో ప్రోమో ముగిసింది. ఇది చూస్తుంటే ఈ బిగ్బాస్ సీజన్లో పాత బిగ్బాస్ ఉంటాడా? లేదా నిజంగానే కొత్త బాస్ను తీసుకొస్తున్నారా? మొత్తానికి ఈ ప్రోమోతో మరింత ఆసక్తి పెంచేశారు.