
బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి (Ashu Reddy)కి గతేడాది బ్రెయిన్ సర్జరీ జరిగింది. దాన్నుంచి కోలుకుంటున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె పంటికింద నొప్పి భరిస్తూ ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఇందుకోసం తలపై భాగంలో కొంత జుట్టును కూడా తీసేశారు. తలకు కుట్లు వేస్తుంటే అషూ ఆ నొప్పిని భరించలేకపోయిన ఫోటోను సైతం వీడియోలో పొందుపరిచింది. మానసికంగా, శారీరకంగా ఎంతో కుంగుబాటుకు గురైన అషూ తనకిలాంటి పరిస్థితి వచ్చిందేంటని కన్నీళ్లు పెట్టుకుంది. ఇప్పుడు ఆ బాధ నుంచి కోలుకుంటున్నట్లు తెలిపింది.

ఇదే జీవితం
'ఇదే కదా జీవితమంటే.. దయచేసి ఇతరులపట్ల దయతో ప్రవర్తించండి. ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండటం నేర్చుకోండి. దానివల్ల చాలామంది బాగుపడతారు' అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నీకు ఆ భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. నువ్వు ఒక ఫైటర్‌వి అని కామెంట్లు చేస్తున్నారు.
అరగుండుతో ఇబ్బందులు
ఇటీవలే ఓ షోలో అషూ రెడ్డి తన తలకు జరిగిన సర్జరీ గురించి చెప్తూ ఎమోషనలైంది. బ్రెయిన్ ఆపరేషన్ కావడంతో తలపై జుట్టు తీసేశారంది. అదేదో పూర్తిగా తీసేసినా బాగుండు కానీ అరగుండు చేశారని బాధపడింది. అద్దంలో తన ముఖం చూసుకుని కెరీర్ అయిపోయిందనుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. డాక్టర్లు ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోమంటే అషూ.. ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక రెండు నెలలకే సెట్స్‌లో అడుగుపెట్టింది. విగ్స్‌తో తన అరగుండును కవర్ చేసుకుని కెమెరా ముందుకు వచ్చింది. వర్క్‌లో బిజీ అవ్వడం వల్లే తను కోలుకున్నానంటోంది.
బిగ్‌బాస్.. సినిమా
డబ్‌స్మాష్ వీడియోలతో ఫేమస్ అయింది అషూ. అచ్చుగుద్దినట్లు సమంతలా ఉండటంతో తనకు బాగా క్రేజ్ వచ్చింది. అదే సమయంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. అలా ఈ వర్మ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకుంది. నెల రోజులకే షో నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లోనూ పాల్గొంది. ఛల్ మోహనరంగ, బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్, ఎ మాస్టర్ పీస్ చిత్రాల్లోనూ నటించింది.
చదవండి: శ్రీదేవి కోరిన మొక్కు నిజం చేసిన దేవుడు.. ఈ ఆలయం ఎక్కడంటే?