
ఫోక్ సాంగ్స్‌తో ప్రజాదరణ పొందిన సింగర్ మంగ్లీ (Singer Mangli) పేరు తాజాగా వార్తల్లో మార్మోగుతోంది. జూన్ 10న తన బర్త్‌డేను పురస్కరించుకుని చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో మందు పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ విదేశీ మద్యంతోపాటు గంజాయి సరఫరా జరిగిందన్న పక్కా సమాచారంతో పోలీసులు రిసార్ట్‌పై దాడులు జరిపారు. పార్టీకి హాజరైన పలువురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు జరపగా 9 మందికి గంజాయి పాజిటివ్‌గా తేలింది.
తప్పు చేసుంటే..
ఈ బర్త్‌డే పార్టీకి బిగ్‌బాస్ బ్యూటీ, నటి దివి వైద్య (Divi Vadthya) హాజరైంది. దీంతో ఆమె పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై దివి స్పందించింది. ఫ్రెండ్ బర్త్‌డే అని పిలిస్తే వెళ్లాను. కానీ, అక్కడ జరిగిన పొరపాట్లను నాపైన తోయడం సరికాదు. నేను నిజంగా తప్పు చేసుంటే, ఆ మేరకు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నా ఫోటో వేయండి. కానీ ఏ సాక్ష్యం లేకుండా నా ఫోటో వాడి నన్ను నెగెటివ్ చేస్తుంటే కెరీర్‌కు ఎంత ఇబ్బంది అవుతుంది?
ఫ్రెండ్ అని వెళ్లా..
ఎంతో కష్టపడి ఇంతదూరం వచ్చాను. ఫ్రెండ్ బర్త్‌డే అంటే ఎవరైనా వెళ్తారు. అలాగే, నేను కూడా ఆ అమ్మాయి నా స్నేహితురాలని వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా ఫోటో వేస్తున్నారు. మీ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా.. దయచేసి నా ఫోటోలు వాడకండి. నాకు ఇబ్బంది అవుతుంది అని ఓ ఆడియో రిలీజ్ చేసింది. అటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనూ హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియను చంపేసినట్లు ఏంటండి ఇది? అని ఆవేదన వ్యక్తం చేసింది. మంగ్లీ బర్త్‌డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని దివి స్పష్టం చేసింది.

చదవండి: ఆడవారి వాష్‌రూమ్‌కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్‌జెండర్ నటి