
ఎన్నో అవమానాలు, ఆటంకాలు దాటుకుని వైద్య విద్యను అభ్యసించింది త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (Trinetra Haldar Gummaraju). దేశంలోనే రెండో ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా ఆ మధ్య తన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్‌తో నటిగానూ మారింది. ఈ మధ్యే కంఖజుర అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. ఇది మే 30 నుంచి సోనీలివ్‌లో ప్రసారమవుతోంది.
హాస్పిటల్‌లో చేదు అనుభవం
తాజాగా త్రినేత్ర.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాక ఒకసారి డాక్టర్‌ను కలిసేందుకు వెళ్లాను. ఆస్పత్రిలో ఉన్న్పపుడు వాష్‌రూమ్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పటికి నా ముఖంలో అమ్మాయి పోలికలే లేవు. అలా అని అబ్బాయిల రెస్ట్‌రూమ్ వాడుకోలేను. ఏదైతే అదైందని అమ్మాయిల బాత్రూమ్‌లోకి వెళ్లాను. అంతే.. అక్కడున్న సెక్యురిటీ గార్డు నన్ను కోపంతో బయటకు తరిమేసింది.
రచ్చ చేయాలనుకోలే..
నేను అబ్బాయిని అనుకుని లోపలకు వెళ్లనివ్వలేదు. నేను ఏమీ అనలేదు. దాన్ని గొడవ చేసి రచ్చ చేయాలనుకోలేదు. అందుకే సైలెంట్‌గా అక్కడినుంచి వెళ్లిపోయాను. కానీ దీనివల్ల నా మనసు గాయపడింది. అమ్మాయిగా మారినప్పటికీ ఆడవారి బాత్రూమ్ ఉపయోగించుకోలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని ఊహించే కాలేజీలో చదువుకునే రోజుల్లో వాష్‌రూమ్‌కి వెళ్లేదాన్నే కాదు. ఇందుకోసం నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు. దీనివల్ల నేను యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇలా వివక్ష ఎదుర్కొనే సమాజంలో బతకడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చింది.
చదవండి: శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్