breaking news
transgender actress
-
‘ట్రాన్స్’మిషన్ పుస్తకంలో పాఠమైంది!
కేరళ విద్యావ్యవస్థలో అభ్యుదయం వెల్లివిరుస్తుంటుంది. జెండర్ వివక్ష లేని సమాజం కోసం బాల్యం నుంచే పాఠాలు బోధిస్తుంటుంది. ఒకప్పుడు పాఠ్యపుస్తకాలలో కుటుంబ ముఖచిత్రంలో అమ్మతోపాటు నాన్న కూడా ఇంటి పనులు చేయడాన్ని ప్రచురించింది. తాజాగా ఇప్పుడు ఓ ట్రాన్స్‌జెండర్ జీవితగాధను పాఠ్యాంశంగా తీసుకుంది. ఎనిమిదవ తరగతి ఆర్ట్స్ టెక్ట్స్ బుక్‌లో ట్రాన్స్ ఆర్టిస్ట్ నేఘా ఎస్ విజయగాధను చేర్చింది. అంతరించి పోవాలి!ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కొత్త కరికులమ్‌లో నాటకరంగం, శిల్పకళ, సంగీతం, సినిమా, నాట్యరంగాలను చేర్చింది. ఆయా రంగాల్లో ప్రముఖుల గురించిన పాఠాలను పాఠ్యపుస్తకాలలో ప్రచురించింది. ఈ క్రమంలో సినీ నటి నేఘా ఎస్ గురించిన పాఠానికి చోటు కల్పించింది ఎస్సీఈఆర్టీ. మలయాళ నటి నేఘా ఎస్... 2022లో నటించిన ‘అంతరం’ సినిమాకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్మ్ అవార్డు అందుకున్నారు. ఒక ట్రాన్స్ ఉమన్‌కు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి. పాఠ్యపుస్తకంలో తన జీవిత పాఠం గురించి తెలుసుకున్న నేఘా ఎస్ భావోద్వేగాలకు లోనయ్యారు. ‘టెక్ట్స్బుక్లో పాఠాన్ని చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి.సమాజం ఇన్నేళ్ల వరకు నన్ను నా పేరుతో గుర్తించనే లేదు. అలాంటిది 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఓ పాఠంలో నా పేరు ఉండడం నన్ను కదిలించింది’ అన్నారామె. సమాజం వేరుగా చూసిన వారిని సమాజంలో భాగంగా చూపించడానికి ఆ రాష్ట్ర విద్యావ్యవస్థ చేసిన ప్రయత్నం గొప్పది. ఆమె సొంతూరు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తీయన్నపురం. కేరళలో నటిగా పురస్కారం అందుకునే వరకు తన సొంత రాష్ట్రం కూడా తనను గుర్తించలేదని, పురస్కారం సందర్భంగా మీడియా కవరేజ్ తర్వాత తనను తన రాష్ట్రం స్వాగతించిందని, అయినప్పటికీ తమిళరాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం తనకు గుర్తింపు రాలేదన్నారామె.విద్యార్థుల్లో జెండర్ అవేర్నెస్ కోసం ఆమె అనేక ప్రభుత్వ స్కూళ్లలో క్లాసులు తీసుకున్నారు. ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో నెలకొని ఉన్న తక్కువ భావనను తొలగించడానికి ఈ పాఠం ఒక మంచి ప్రయత్నం. అయితే ప్రపంచంలో కరడుగట్టి ఉన్న అంతరం తొలగిపోవడానికి ఇది సరిపోదు. అంతరించిపోయే వరకు ఇంకా చాలా చేయాలంటూ ‘నా జీవిత పాఠం చదివిన విద్యార్థులు తమను తాము శక్తిమంతంగా తీర్చిదిద్దుకోగలగాలి’ అని ఆశాభావం వ్యక్తం చేశారామె. -
ఆడవారి వాష్‌రూమ్‌కు వెళ్తుంటే గెంటేశారు: ట్రాన్స్‌జెండర్ నటి
ఎన్నో అవమానాలు, ఆటంకాలు దాటుకుని వైద్య విద్యను అభ్యసించింది త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు (Trinetra Haldar Gummaraju). దేశంలోనే రెండో ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా ఆ మధ్య తన పేరు వార్తల్లో మార్మోగిపోయింది. రెండేళ్ల క్రితం వచ్చిన మేడ్ ఇన్ హెవెన్ రెండో సీజన్‌తో నటిగానూ మారింది. ఈ మధ్యే కంఖజుర అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. ఇది మే 30 నుంచి సోనీలివ్‌లో ప్రసారమవుతోంది.హాస్పిటల్లో చేదు అనుభవంతాజాగా త్రినేత్ర.. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను అమ్మాయిగా మారేందుకు ఆపరేషన్ చేయించుకున్నాక ఒకసారి డాక్టర్‌ను కలిసేందుకు వెళ్లాను. ఆస్పత్రిలో ఉన్న్పపుడు వాష్‌రూమ్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అప్పటికి నా ముఖంలో అమ్మాయి పోలికలే లేవు. అలా అని అబ్బాయిల రెస్ట్రూమ్ వాడుకోలేను. ఏదైతే అదైందని అమ్మాయిల బాత్రూమ్లోకి వెళ్లాను. అంతే.. అక్కడున్న సెక్యురిటీ గార్డు నన్ను కోపంతో బయటకు తరిమేసింది. రచ్చ చేయాలనుకోలే..నేను అబ్బాయిని అనుకుని లోపలకు వెళ్లనివ్వలేదు. నేను ఏమీ అనలేదు. దాన్ని గొడవ చేసి రచ్చ చేయాలనుకోలేదు. అందుకే సైలెంట్‌గా అక్కడినుంచి వెళ్లిపోయాను. కానీ దీనివల్ల నా మనసు గాయపడింది. అమ్మాయిగా మారినప్పటికీ ఆడవారి బాత్రూమ్ ఉపయోగించుకోలేకపోయాను. ఇలాంటి ఇబ్బందుల్ని, అవమానాల్ని ఊహించే కాలేజీలో చదువుకునే రోజుల్లో వాష్‌రూమ్‌కి వెళ్లేదాన్నే కాదు. ఇందుకోసం నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు. దీనివల్ల నేను యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ఇలా వివక్ష ఎదుర్కొనే సమాజంలో బతకడం దురదృష్టకరం అని చెప్పుకొచ్చింది.చదవండి: శ్రీలీల కోసం మంత్రి స్పీచ్ ఆపేసిన యాంకర్ ఝాన్సీ.. వీడియో వైరల్ -
తమిళ బిగ్‌బాస్: బరిలో ట్రాన్స్‌జెండర్, ఫేమస్ యాంకర్, సింగర్స్
తమిళంలో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తాజాగా ఐదో సీజన్లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ బిగ్‌బాస్ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. బుల్లితెరతో పాటు వెండితెర స్టార్లను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెల్కమ్ చెప్పాడు. అక్టోబర్ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్ ఐదో సీజన్లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో సింగర్లు, నటులు, కళాకారులు, యాంకర్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. మరి వారెవరో చదివేద్దాం... అక్షర రెడ్డి: నటి, మోడల్ అక్షర రెడ్డి మిస్ గ్లోబ్ 2019 అవార్డు అందుకుంది . ఇంతకుముందు విల్లా టు విలేజ్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. తనలోని యాక్టింగ్ టాలెంట్‌ను బయటపెడుతూ.. మలేషియన్ మూవీ కసు మెలా కసు చిత్రంలో తొలిసారి నటించింది. అభినయ్ వాడి: లెజెండరీ నటుడు జెమిని గణేశన్- సావిత్రి గణేశన్‌ల మనవడే అభినయ్. ఇతడు జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. ప్రస్తుతం అతడు యువతరానికి టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే పేదరైతులకు ఏదైనా సాయం చేయాలన్నది ఆయన అభిలాష. ఇక అభినయ్ రామానుజన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అభినయ్ ఫ్యాషన్ డిజైనర్ అపర్ణను వివాహం చేసుకోగా వీరికి స్వస్తిక అనే కూతురు ఉంది. మధుమిత రఘునాధన్: శ్రీలంకన్ తమిళ ఫ్యామిలీకి చెందిన మధుమిత రంఘునాధన్ జెర్మనీలో సెటిల్ అయింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కోర్సు పూర్తి చేసిన మధుమితకు మోడలింగ్ అంటే మక్కువ ఎక్కువ. ఎలాగైనా సినీరంగంలో రాణించాలని కలలు కంటోంది మధుమిత. బిగ్‌బాస్ ద్వారా తన కలను నిజం చేసుకోవాలని ఆశపడుతోందీ మోడల్. రాజు జయమోహన్: తిరునల్వేలికి చెందిన రాజు నటుడు మాత్రమే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా! ఇతడు ప్రముఖ డైరెక్టర్ కె.భాగ్యరాజ్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. కనా కానుమ్ కలంగళ్ సీరియల్‌తో నటనా రంగంలోకి ప్రవేశించిన అతడు తర్వాత పలు షోలలోనూ పాల్గొన్నాడు. బుల్లితెరపై సత్తా చూపిన ఇతడు నట్పున ఎన్నాను తెరియుమా అనే చిత్రంతో వెండితెరపైనా లక్ పరీక్షించుకున్నాడు. చిన్న పొన్ను: చిన్న పొన్ను ప్లేబ్యాక్ సింగర్. 13 ఏళ్లకే తన గాత్రంతో మ్యాజిక్ చేయడం మొదలు పెట్టింది చిన్న పొన్ను. ఈమె సూపర్ స్టార్ రజనీకాంత్, హీరోయిన్లు జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమాలో తొలిసారి పాట పాడింది. ఫోక్ సాంగ్స్ ఇప్పటికీ మార్మోగిపోవడానికి చిన్న పొన్నులాంటి ఫోక్ ఆర్టిస్ట్‌లే కారణం. పావని రెడ్డి: మొదట్లో మోడలింగ్ చేసిన పావని రెడ్డి తర్వాత యాక్టింగ్‌నే తన కెరీర్‌గా స్థిరపరుచుకుంది. రెట్టా వాల్ కురువి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.చిన్న తంబి, రసంతి సీరియల్స్ ద్వారా అభిమానులకు ఆమె మరింత దగ్గరైంది. పలు భాషల్లోని సినిమాల్లోనూ పావని నటించి మెప్పించింది. ఇమ్మన్ అన్నాచి: ఇమ్మాని అన్నాచి నటుడు మాత్రమే కాదు పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరికొన్ని షోలకు జడ్జిగానూ పని చేశాడు. సొలుంగన్నే సొల్లుంగ, గల్లపెట్టి వంటి పలు షోలు అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తనకున్న పాపులారిటీతో రాజకీయాల్లోకి సైతం ప్రవేశించాడు. చెన్నై కాదల్ చిత్రంతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇసాయివాణి: ఈమె పూర్తి పేరు గానా ఇసాయివాణి. 2020వ సంవత్సరంలో ఆమె బీబీ 100 ఉమెన్ అవార్డు అందుకుంది. ఆరేళ్లకే పాటలు పాడటం మొదలు పెట్టిన ఆమె 10వేలకు పైగా షోలలో పాల్గొని తన గాత్రంతో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసింది. అభిషేక్ రాజా: నటుడు, రచయిత, వీడియో జాకీ, క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అభిషేక్ రాజా సోషల్ మీడియా సెన్సేషన్ కూడా! సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో దిట్ట అయిన అభిషేక్ ఇమైక్కా నొడిగల్ అనే సినిమాలోనూ ఓ పాత్రలో నటించాడు. సిబీ భువన్ చంద్రన్: ఇతడు నటుడు. యూకేలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భువన చంద్రన్ రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేశాడు. కానీ సినిమాలపై ఉన్న మోజుతో భారత్‌కు తిరిగి వచ్చేశాడు. వంజాగర్ ఉలగం చిత్రంలో తొలిసారి నటించాడు. మాస్టర్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. నమిత మరిముతు: ట్రాన్స్‌జెండర్ నమిత మరిముతు పాపులర్ మోడల్. మిస్ ట్రాన్స్ స్టార్ ఇంటర్నేషనల్ 2020 పేజెంట్ అవార్డు అందుకున్న నమిత నటిగానూ రాణిస్తోంది. వరుణ్ ఇషారి కమలకన్నన్: ప్రముఖ నటుడు ఇషారి వేలన్ మనవడే వరుణ్ ఇషారి. ఇతడు నిర్మాత ఇషారి గణేశ్‌కు బంధువు కూడా అవుతాడు. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు పార్కర్ స్పోర్స్ట్లోనూ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. థలైవా సినిమాలో అతడు పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ప్రియాంక దేశ్‌పాండే: తమిళ బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్లలో ప్రియాంక దేశ్‌పాండే ఒకరు. కింగ్స్ ఆఫ్ డ్యాన్స్, స్టార్ట్ మ్యూజిక్, సూపర్ సింగర్ 4,5,6,7,8 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించింది. కలక్క పోవద్దు యారు షోకు సహజడ్జిగానూ పనిచేసింది. సురుతి: ఇంజనీరింగ్ అభ్యసించిన సురుతి మోడలింగ్ అంటే ఇంట్రస్ట్. దీంతో మోడలింగ్‌లో అడుగు పెట్టిన ఆమె నాలుగేళ్లుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈమె జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కూడా! లిక్కీ బెర్రీ: లిక్కీ బెర్రీ సింగర్, డాక్టర్, పాటల రచయిత, కాస్మొటాలజిస్ట్. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె ర్యాపర్‌గా రాణిస్తోంది. తమరై సెల్వి: తమరై సెల్వి జానపద కళాకారిణి. ఈమె వందలాది షోలలో పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. నదియా చాంగ్: నదియా చాంగ్ ఫేమస్ మోడల్. మలేషియన్ ఇండియన్ మోడల్ పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. మిసెస్ మలేషియా వరల్డ్ 2016 బ్యూటీ పేజెంట్ ఫైనలిస్టుగానూ సత్తా చాటింది. నిరూప్ నందకుమార్: ఇతడు ఎంటర్ప్రెన్యూర్. బెంగళూరులో స్వంతంగా వ్యాపారం నడుపుతున్న నిరూప్‌కు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్. బిగ్‌బాస్ షో ద్వారానైనా నటుడిగా ఛాన్స్ వస్తే బాగుండనుకుంటున్నాడు నిరూప్. -
నటిపై మంత్రి సెక్యురిటీ సిబ్బంది దాడి
మణిపూర్‌లో ప్రముఖ ట్రాన్స్‌జెండర్ నటి, మోడల్ బిశేష్ హురెమ్పై మంత్రి సెక్యురిటీ సిబ్బంది దాడిచేశారు. థాయ్‌లాండ్‌లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2016 పోటీలకు ఎంపికైన బిశేష్ హురెమ్ను మణిపూర్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మోయిరంగ్దెమ్ ఒకెండ్రో సిబ్బంది చేయిచేసుకున్నారు. ఇటీవల మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో బిశేష్తో పాటు ఫ్రెండ్‌పై దాడి జరిగింది. ఇరుకైన రహదారిలో వెళ్లే విషయంలో మంత్రి సిబ్బందికి, బిశేష్కు వాగ్వాదం జరిగింది. మంత్రి సమక్షంలోనే తమపై దాడి చేశారని, ఆయన సిబ్బందిని ఆపేయత్నం చేయలేదని, కారులోంచి కూడా దిగలేదన్నది బిశేష్ ఆరోపణ. మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ అందాల పోటీల్లో 27 ఏళ్ల బిశేష్ పాల్గొంటున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా ఈలోగా బిశేష్పై దాడిజరగడంతో చాలామంది షాకయ్యారు. ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ చేసిన మణిపూర్‌కు చెందిన బిశేష్ ఈశాన్య భారత్‌లో బాగా పాపులర్.