Bigg Boss Tamil 5: బిగ్‌బాస్‌లో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లు వీళ్లే..

Tamil Bigg Boss 5: Here Is Full And Final List Of Bigg Boss Contestants - Sakshi

తమిళంలో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ తాజాగా ఐదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ షోను గ్రాండ్‌గా లాంచ్‌ చేశాడు. బుల్లితెరతో పాటు వెండితెర స్టార్లను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెల్‌కమ్‌ చెప్పాడు. అక్టోబర్‌ 3న ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో సింగర్లు, నటులు, కళాకారులు, యాంకర్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఉన్నారు. మరి వారెవరో చదివేద్దాం...

అక్షర రెడ్డి: నటి, మోడల్‌ అక్షర రెడ్డి మిస్‌ గ్లోబ్‌ 2019 అవార్డు అందుకుంది . ఇంతకుముందు విల్లా టు విలేజ్‌ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది. తనలోని యాక్టింగ్‌ టాలెంట్‌ను బయటపెడుతూ.. మలేషియన్‌ మూవీ కసు మెలా కసు చిత్రంలో తొలిసారి నటించింది.

అభినయ్‌ వాడి: లెజెండరీ నటుడు జెమిని గణేశన్‌- సావిత్రి గణేశన్‌ల మనవడే అభినయ్‌. ఇతడు జాతీయ స్థాయి టెన్నిస్‌ ఆటగాడు. ప్రస్తుతం అతడు యువతరానికి టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నాడు. అయితే పేదరైతులకు ఏదైనా సాయం చేయాలన్నది ఆయన అభిలాష. ఇక అభినయ్‌ రామానుజన్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. అభినయ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ అపర్ణను వివాహం చేసుకోగా వీరికి స్వస్తిక అనే కూతురు ఉంది.

మధుమిత రఘునాధన్‌: శ్రీలంకన్‌ తమిళ ఫ్యామిలీకి చెందిన మధుమిత రంఘునాధన్‌ జెర్మనీలో సెటిల్‌ అయింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కోర్సు పూర్తి చేసిన మధుమితకు మోడలింగ్‌ అంటే మక్కువ ఎక్కువ. ఎలాగైనా సినీరంగంలో రాణించాలని కలలు కంటోంది మధుమిత. బిగ్‌బాస్‌ ద్వారా తన కలను నిజం చేసుకోవాలని ఆశపడుతోందీ మోడల్‌.

రాజు జయమోహన్‌: తిరునల్వేలికి చెందిన రాజు నటుడు మాత్రమే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్‌ కూడా! ఇతడు ప్రముఖ డైరెక్టర్‌ కె.భాగ్యరాజ్‌కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేశాడు. కనా కానుమ్‌ కలంగళ్‌ సీరియల్‌తో నటనా రంగంలోకి ప్రవేశించిన అతడు తర్వాత పలు షోలలోనూ పాల్గొన్నాడు. బుల్లితెరపై సత్తా చూపిన ఇతడు నట్‌పున ఎన్నాను తెరియుమా అనే చిత్రంతో వెండితెరపైనా లక్‌ పరీక్షించుకున్నాడు.

చిన్న పొన్ను: చిన్న పొన్ను ప్లేబ్యాక్‌ సింగర్‌. 13 ఏళ్లకే తన గాత్రంతో మ్యాజిక్‌ చేయడం మొదలు పెట్టింది చిన్న పొన్ను. ఈమె సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, హీరోయిన్లు జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమాలో తొలిసారి పాట పాడింది. ఫోక్‌ సాంగ్స్‌ ఇప్పటికీ మార్మోగిపోవడానికి చిన్న పొన్నులాంటి ఫోక్‌ ఆర్టిస్ట్‌లే కారణం.

పావని రెడ్డి: మొదట్లో మోడలింగ్‌ చేసిన పావని రెడ్డి తర్వాత యాక్టింగ్‌నే తన కెరీర్‌గా స్థిరపరుచుకుంది. రెట్టా వాల్‌ కురువి సీరియల్‌ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.చిన్న తంబి, రసంతి సీరియల్స్‌ ద్వారా అభిమానులకు ఆమె మరింత దగ్గరైంది. పలు భాషల్లోని సినిమాల్లోనూ పావని నటించి మెప్పించింది.

ఇమ్మన్‌ అన్నాచి: ఇమ్మాని అన్నాచి నటుడు మాత్రమే కాదు పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరికొన్ని షోలకు జడ్జిగానూ పని చేశాడు. సొలుంగన్నే సొల్లుంగ, గల్లపెట్టి వంటి పలు షోలు అతడికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. తనకున్న పాపులారిటీతో రాజకీయాల్లోకి సైతం ప్రవేశించాడు. చెన్నై కాదల్‌ చిత్రంతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు.

ఇసాయివాణి: ఈమె పూర్తి పేరు గానా ఇసాయివాణి. 2020వ సంవత్సరంలో ఆమె బీబీ 100 ఉమెన్‌ అవార్డు అందుకుంది.  ఆరేళ్లకే పాటలు పాడటం మొదలు పెట్టిన ఆమె 10వేలకు పైగా షోలలో పాల్గొని తన గాత్రంతో ఎంతోమందిని మంత్రముగ్ధులను చేసింది. 

అభిషేక్‌ రాజా: నటుడు, రచయిత, వీడియో జాకీ, క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అభిషేక్‌ రాజా సోషల్‌ మీడియా సెన్సేషన్‌ కూడా! సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో దిట్ట అయిన అభిషేక్‌ ఇమైక్కా నొడిగల్‌ అనే సినిమాలోనూ ఓ పాత్రలో నటించాడు.

సిబీ భువన్‌ చంద్రన్‌: ఇతడు నటుడు. యూకేలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన భువన చంద్రన్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌గా పని చేశాడు. కానీ సినిమాలపై ఉన్న మోజుతో భారత్‌కు తిరిగి వచ్చేశాడు. వంజాగర్‌ ఉలగం చిత్రంలో తొలిసారి నటించాడు. మాస్టర్‌ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

నమిత మరిముతు: ట్రాన్స్‌జెండర్‌ నమిత మరిముతు పాపులర్‌ మోడల్‌. మిస్‌ ట్రాన్స్‌ స్టార్‌ ఇంటర్నేషనల్‌ 2020 పేజెంట్‌ అవార్డు అందుకున్న నమిత నటిగానూ రాణిస్తోంది. 

వరుణ్‌ ఇషారి కమలకన్నన్‌: ప్రముఖ నటుడు ఇషారి వేలన్‌ మనవడే వరుణ్‌ ఇషారి. ఇతడు నిర్మాత ఇషారి గణేశ్‌కు బంధువు కూడా అవుతాడు. మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు పార్కర్‌ స్పోర్స్ట్‌లోనూ ప్రత్యేకంగా ట్రైనింగ్‌ తీసుకున్నాడు. థలైవా సినిమాలో అతడు పోషించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.

ప్రియాంక దేశ్‌పాండే: తమిళ బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటున్న యాంకర్లలో ప్రియాంక దేశ్‌పాండే ఒకరు.  కింగ్స్‌ ఆఫ్‌ డ్యాన్స్‌, స్టార్ట్‌ మ్యూజిక్‌, సూపర్‌ సింగర్‌ 4,5,6,7,8 సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించింది. కలక్క పోవద్దు యారు షోకు సహజడ్జిగానూ పనిచేసింది.

సురుతి: ఇంజనీరింగ్‌ అభ్యసించిన సురుతి మోడలింగ్‌ అంటే ఇంట్రస్ట్‌. దీంతో మోడలింగ్లో అడుగు పెట్టిన ఆమె నాలుగేళ్లుగా ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈమె జాతీయ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి కూడా!

లిక్కీ బెర్రీ: లిక్కీ బెర్రీ సింగర్‌, డాక్టర్‌, పాటల రచయిత, కాస్మొటాలజిస్ట్‌. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె ర్యాపర్‌గా రాణిస్తోంది.

తమరై సెల్వి: తమరై సెల్వి జానపద కళాకారిణి. ఈమె వందలాది షోలలో పాల్గొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది.

నదియా చాంగ్‌: నదియా చాంగ్‌ ఫేమస్‌ మోడల్‌. మలేషియన్‌ ఇండియన్‌ మోడల్‌ పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. మిసెస్‌ మలేషియా వరల్డ్‌ 2016 బ్యూటీ పేజెంట్‌ ఫైనలిస్టుగానూ సత్తా చాటింది.

నిరూప్‌ నందకుమార్‌: ఇతడు ఎంటర్‌ప్రెన్యూర్‌. బెంగళూరులో స్వంతంగా వ్యాపారం నడుపుతున్న నిరూప్‌కు యాక్టింగ్‌ అంటే ఇంట్రస్ట్. బిగ్‌బాస్‌ షో ద్వారానైనా నటుడిగా ఛాన్స్‌ వస్తే బాగుండనుకుంటున్నాడు నిరూప్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top