57 ఏళ్ల వయసులో మళ్లీ తండ్రి కాబోతున్న నటుడు? | Arbaaz Khan Expecting Baby With Sshura Khan? Maternity Clinic Visit Creates Rumours On Pregnancy | Sakshi
Sakshi News home page

Arbaaz Khan: ఆల్రెడీ 22 ఏళ్ల కొడుకు.. ఇప్పుడు మరో బిడ్డ?

Apr 16 2025 7:46 AM | Updated on Apr 16 2025 8:43 AM

Arbaaz Khan Expecting Baby With Sshura Khan

లేటు వయసులో పిల్లల్ని కనడం సెలబ్రిటీల విషయంలో సాధారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే కెరీర్ లో బిజీగా ఉండి లేటుగా పెళ్లి చేసుకుంటారు. తర్వాత కొన్నాళ్లకు పిల్లల్ని కంటూ ఉంటారు. ఇలానే ఇప్పుడు ఓ నటుడు ఏకంగా 57 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నాడనే మాట వినిపిస్తోంది. ఎవరా నటుడు?

(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. ‍అయినా బాధ లేదు) 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్(Arbaaz Khan). తెలుగు, హిందీ సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలోనే నటి మలైకా అరోరాని(Malaika Arora) పెళ్లి చేసుకున్న ఇతడు.. కొన్నేళ్ల క్రితం విడాకులు కూడా ఇచ్చేశాడు. వీళ్లకు 22 ఏళ్ల అర్హాన్ ఖాన్ అనే కొడుకు ఉన్నాడు.

మలైకాకు విడాకులు ఇచ్చిన తర్వాత మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్(Sshura Khan)ని 2023 డిసెంబరులో అర్బాజ్ ఖాన్ పెళ్లిచేసుకున్నాడు. తాజాగా ఈ జంట.. ముంబైలోని ఓ మెటర్నిటీ క్లినిక్ దగ్గర కనిపించారు. దీంతో అర్భాజ్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే రూమర్స్ వచ్చాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో ఇతడు జై చిరంజీవ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల్లో నటించాడు.

(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్)

Advertisement
 
Advertisement
Advertisement