'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. ‍అయినా బాధ లేదు | SS Thaman Reacts On Allu Arjun Pushpa 2 The Rule Movie Music Dispute In His Latest Interview | Sakshi
Sakshi News home page

Thaman: 'పుష్ప 2' కోసం 10 రోజులు కష్టపడ్డా కానీ..

Apr 16 2025 7:08 AM | Updated on Apr 16 2025 8:45 AM

Thaman Respond On Pushpa 2 Music Dispute Latest Interview

గతేడాది డిసెంబరులో రిలీజైన పుష్ప 2 మూవీ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో తెగ ఆడేసింది. అధికారికంగా చెప్పలేదు గానీ రూ.2000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని టాక్. సరే ఇవన్నీ పక్కనబెడితే పుష్ప 2కి తన మ్యూజిక్ వాడుకోకపోవడం గురించి తమన్ ఇన్నాళ్లకు స్పందించాడు.

(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్)

పుష్ప 2 విడుదలకు ముందు మ్యూజిక్ విషయంలో పలువురు పేర్లు వినిపించాయి. అందులో తమన్ కూడా ఒకరు. ఈ విషయాన్ని ఓ మూవీ ఫంక్షన్ లో ఇతడే స్వయంగా బయటపెట్టాడు. తాను కూడా పనిచేస్తున్నానని అన్నాడు. కట్ చేస్తే టైటిల్స్ లో తమన్ పేరు ఎక్కడా కనిపించలేదు. తాజాగా సుమ ఇంటర్వ్యూలో ‍అసలేం జరిగిందనే విషయాన్ని బయటపెట్టాడు.

'పుష‍్ప 2 కోసం నేను 10 రోజుల పాటు కష్టపడ్డా. మూడు వెర్షన్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాను. టీమ్ కి అది నచ్చింది కూడా. కాకపోతే ఫైనల్ గా డీఎస్పీ, సామ్ సీఎస్ ఇచ్చిన మ్యూజిక్ ఓకే చేశారు. అయినా సరే నాకేం బాధ లేదు. అందరి ఒప్పందంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని తమన్ చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: బన్నీ కోసం ముగ్గురు బ్యూటీస్.. కాకపోతే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement