
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) ఎవరితో సినిమా చేస్తాడా అనుకుంటే తమిళ దర్శకుడు అట్లీకే ఓటేశాడు. త్రివిక్రమ్ పేరు కూడా వినిపించింది కానీ అట్లీతో(Atlee) ప్రాజెక్ట్ ఉంటుందని ఈ మధ్య అధికారికంగానూ ప్రకటించారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కాకపోతే హీరోయిన్లు ఎవరనే దగ్గర డిస్కషన్స్ జరుగుతున్నాయి.
(ఇదీ చదవండి: సీరియల్ నటి వైష్ణవి నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్)
బన్నీ-అట్లీ సినిమాని ఇంటర్నేషనల్ లెవల్లో తీయబోతున్నారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ వీడియోలో దీని గురించి హింట్ ఇచ్చేశారు. కాబట్టి బన్నీకి సరిపోయే హీరోయిన్లని తీసుకోవాలి. ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా ఆప్షన్స్ కనిపించట్లేదు. అందుకే బాలీవుడ్ వైపు చూస్తున్నారట.
ఇప్పుడైతే జాన్వీ కపూర్(Janhvi Kapoor), దిశా పటానీ పేర్లు వినిపిస్తున్నారు. వీళ్లు కన్ఫర్మా కాదా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. కాకపోతే ఎవరి డేట్స్ అందుబాటులో ఉన్నాయనే దానిబట్టి హీరోయిన్లని తీసుకోవాలని అనుకుంటున్నారట. మొత్తంగా అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)