
సీరియల్ నటీనటులు చాలా సందర్భాల్లో తోటి యాక్టర్స్ నే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు బిజినెస్ మ్యాన్ లాంటి వాళ్లతో కొత్త జీవితం ప్రారంభిస్తుంటారు. కానీ కన్నడ నటి వైష్ణవి మాత్రం ఎయిర్ ఫోర్స్ అధికారితో కొత్త లైఫ్ షురూ చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈమె నిశ్చితార్థం జరిగింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
అగ్నిసాక్షి, బహుకృత వేషం, సీతారామ తదితర సీరియల్స్ లో నటించి కన్నడ నాట గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి గౌడ.. ఎయిర్ ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో ఎంగేజ్ మెంట్ జరిగింది. బెంగళూరులో సోమవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే సహనటీనటులు.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!)

