సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్‌కి మెమో | Allu Arjun Not Attend Nampally Court Over Sandhya Theatre Issue | Sakshi
Sakshi News home page

Allu Arjun: తొక్కిసలాట కేసు వాయిదా..బన్నీ తప్ప అందరూ హాజరు

Jun 22 2026 12:11 PM | Updated on Jun 22 2026 12:23 PM

Allu Arjun Not Attend Nampally Court Over Sandhya Theatre Issue

'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట గురించి తెలిసిందే. ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటినుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. సోమవారం విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు, హీరో అల్లు అర్జున్‌కి సమన్లు జారీ చేసింది. కానీ ఇతడు తప్పితే కేసులో భాగమైన మిగిలిన వాళ్లందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే కేసుని వచ్చే నెల 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

(ఇదీ చదవండి: నా తండ్రి నా దేవుడు.. నాకు జీవితం ఇచ్చింది ఆయనే: అల్లు అర్జున్‌)

హాజరు కానందుకు అల్లు అర్జున్‌కి మెమో దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ తొక్కిసలాట కేసులో A11గా ఉన్న బన్నీ వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కావాల్సింది. కానీ ఇతడి తరఫున న్యాయవాది వచ్చారు. ముంబైలో షూటింగ్‌లో ఉన్న కారణంగా అల్లు అర్జున్ రాలేకపోయారు. ముంబైలో అట్లీ దర్శకత్వంలో తీస్తున్న 'రాకా' షూటింగ్‌లో బన్నీ బిజీగా ఉన్నాడు.

(ఇదీ చదవండి: శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement