అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి? | 20 Years Old Music Director Sai Abhyankkar For Allu Arjun And Atlee Movie, Know Interesting Facts About Him In Telugu | Sakshi
Sakshi News home page

Sai Abhyankkar: బన్నీ-అట్లీ సినిమా కోసం సాయి.. ఇతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Apr 9 2025 7:12 AM | Updated on Apr 9 2025 10:58 AM

Allu Arjun Music Director Sai Abhyankkar Personal Details

అల్లు అర్జున్ (Allu Arjun) కొత్త సినిమా ప్రకటించాడు. తమిళ దర్శకుడు అట్లీతో (Director Atlee) కలిసి సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇదంతా అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా 20 ఏళ్ల కుర్రాడిని పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ అతడెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)

యూట్యూబ్ లో గతేడాది వైరల్ ‍అయిన ఆల్బమ్ సాంగ్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా 'కచ్చి సేరా', 'ఆశా కూడా' పాటలు ఉంటాయి. ఎందుకంటే తలో ఒకటి 200 మిలియన్ వ్యూస్ సాధించాయి. వీటిని పాడి, ఇందులో కనిపించిన కుర్రాడే సాయి అభయంకర్(Sai Abhyankkar).

అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడిన సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే సాయి. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. అనిరుధ్ దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్ కంపోజర్ గా పనిచేశాడు. గతేడాది బెంజ్ అనే తమిళ మూవీలో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. దీంతో పాటు మరో రెండు-మూడు ప్రాజెక్టులు కూడా సొంతం చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్)

మిగతా సినిమాల సంగతేమో గానీ అల్లు అర్జున్-అట‍్లీ సినిమా కోసం సాయి ఎంపికవడం మాత్రం అందరికీ షాకిచ్చింది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కోసం 20 ఏళ్ల కుర్రాడిని ఎంపిక చేశారంటే విషయం గట్టిగానే ఉందనమాట. అనౌన్స్ మెంట్ వీడియోకు ఇచ్చిన మ్యూజిక్ వింటేనే ఈ విషయం అర్థమైపోతుంది. 

ప్రస్తుతానికి ఇతడు బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నట్లు ‍అధికారికంగా చెప్పలేదు. త్వరలో మంచిరోజు చూసి ప్రకటిస్తారేమో చూడాలి. ఇకపోతే సాయి అభయంకర్ కి ట్విన్ సిస్టర్ ఉంది. ఆమె పేరు సాయిస్మృతి. ఈమె కూడా సింగరే.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement