తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్ | Odela 2 Trailer Telugu Release | Sakshi
Sakshi News home page

Odela 2 Trailer: విజువల్స్, మ్యూజిక్ సూపర్.. ట్రైలర్ చూశారా?

Apr 8 2025 4:54 PM | Updated on Apr 8 2025 4:58 PM

Odela 2 Trailer Telugu Release

తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఓదెల 2'. ఇ‍ప్పటికే టీజర్ తో మంచి బజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఏప్రిల్ 17న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 

 (ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)

ట్రైలర్ బట్టి చూస్తే.. ఓదెల అనే ఊరిలో ప్రేతాత్మల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఎక్కడో కాశీలో ఉన్న శివశక్తి (తమన్నా) ఈ ఊరికి వస్తుంది. తర్వాత దెయ్యాల ఆట ఎలా కట్టించింది అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.

తమన్నా తప్పితే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేనప్పటికీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రస్తుతం డివోషనల్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. చూస్తుంటే ఓదెల 2.. బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయ్యేలా కనిపిస్తుంది. అశోక్ తేజ దర్శకుడు కాదా.. సంపత్ నంది మిగతా విషయాలన్నీ చూసుకున్నారు.

 (ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ ఫ్రస్టేషన్.. సందేహాలు తీర్చిన మారుతి)

Advertisement
 
Advertisement
Advertisement