దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్ | Ntr Attends Vamshi Paidipally Wife Birthday Party Latest | Sakshi
Sakshi News home page

NTR: సతీసమేతంగా పుట్టినరోజు పార్టీలో పాల్గొన్న తారక్

Apr 8 2025 1:28 PM | Updated on Apr 8 2025 2:29 PM

Ntr Attends Vamshi Paidipally Wife Birthday Party Latest

చాన్నాళ్ల తర్వాత మొన్నీమధ్య 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్(Jr Ntr).. ఇప్పుడు తెలుగు దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కుమారుడికి గాయాలు)

తనతో పాటు పనిచేసిన పలువురు దర్శకులతో తారక్ మంచి బాండింగ్ మెంటైన్ చేస్తూ ఉంటాడు. అలా తనకు 'బృందావనం' లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఇంటికి ఎన్టీఆర్ వెళ్లాడు. అతడి భార్య మాలిని పుట్టినరోజు వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నాడు.

ఈ పుట్టినరోజు సెలబ్రేష‍న్స్ లో తారక్ తో పాటు సుకుమార్(Sukumar)-అతడి భార్య, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటోని సుకుమార్ భార్య బబిత తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మహేశ్ బాబు ప్రస్తుతం రోమ్ టూర్ లో ఉన్నాడు. లేదంటే తన భార్యతో కలిసి ఈ పార్టీలో కనిపించేవాడేమో!

(ఇదీ చదవండి: పాత కేసు.. హీరోయిన్ కి మళ్లీ అరెస్ట్ వారెంట్)

Advertisement
 
Advertisement
Advertisement