మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌.. కొత్తగా మల్టీఫ్లెక్స్‌ నిర్మాణాలు ఎక్కడంటే? | Allu Arjun And Mahesh Babu Establish Multiplex In Some Cities | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌.. ఇద్దరు కలిసి భారీ ప్లాన్‌

Jun 8 2025 8:00 AM | Updated on Jun 8 2025 1:59 PM

Allu Arjun And Mahesh Babu Establish Multiplex In Some Cities

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, రవితేజ, విజయ్‌ దేవరకొండ ఇప్పటికే మల్టీప్లెక్స్‌ నిర్మాణంలో అడుగుపెట్టారు. ఏషియన్‌ గ్రూప్స్‌ భాగస్వామ్యంతో వారు ఈ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోనే అత్యంత విలాసవంతమై మల్టీప్లెక్స్‌ను (AMB) మహేశ్‌బాబు నిర్మించగా.. (AAA)పేరుతో అల్లు అర్జున్‌ రీసెంట్‌గా ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు వారిద్దరూ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

అయితే, (AMB) పేరుతో బెంగళూరులో ఒక భారీ మల్టీప్లెక్స్‌ను మహేశ్‌ నిర్మించారు. త్వరలో ప్రారంభం కానుంది. ఆరు స్క్రీన్స్‌తో అత్యంత లగ్జరీ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇప్పుడు చెన్నై, గోవాలో కూడా మరో మల్టీప్లెక్స్‌ నిర్మించబోతున్నారు. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి అక్కడ అతిపెద్ద థియేటర్‌ను నిర్మించాలని ప్రిన్స్‌ మహేశ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఏషియన్‌ సినిమాస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ తన సన్నిహితుల వద్ద చెప్పారు.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఇప్ప‌టికే హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో (AAA) సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ఏషియన్‌ సినిమాస్‌ భాగస్వామ్యంతోనే ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు. అయితే, ఇప్పుడు ఆయన వైజాగ్‌లో   AAA మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  వైజాగ్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఇనార్బిట్ మాల్‌లో హైదరాబాద్‌లో ఉన్నట్లే మల్టీప్లెక్స్ కట్టిస్తున్నారట. ఇదే విషయాన్ని సునీల్‌ నారంగ్‌ చెప్పుకొచ్చారట. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో అతిపెద్ద ఐమాక్స్‌ థియేటర్‌ కూడా త్వరలో నిర్మించనున్నట్లు ఏషియన్‌ అధినేత సునీల్‌ నారంగ్‌ చెప్పారని మీడియా సర్కిల్‌లో ఒక వార్త ఉంది. భాగ్యనగరంలో ఇప్పటి వరకు  నిజమైన IMAX థియేటర్లు లేవు. గతంలో హైదరాబాద్‌లో IMAX థియేటర్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు అవి లేవు. అయితే, ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో "PCX" అని పిలువబడే ఒక పెద్ద స్క్రీన్ ఉంది, ఇది 3D IMAX 70mm స్క్రీన్‌గా ఉండేది.., కానీ ఇప్పుడు కాదు. ఒకవేళ అన్ని అనుకున్నట్లు జరిగితే హైదరాబాద్‌కు తొలి ఐమాక్స్‌ థియేటర్‌ త్వరలో రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement