వినోదాలు పంచే రంభ ఊర్వశి మేనక | Allari Naresh 65th film titled Ramba Oorvasi Menaka | Sakshi
Sakshi News home page

వినోదాలు పంచే రంభ ఊర్వశి మేనక

Jul 1 2026 4:19 AM | Updated on Jul 1 2026 4:19 AM

Allari Naresh 65th film titled Ramba Oorvasi Menaka

‘అల్లరి’ నరేష్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. ‘కామెడీ గోస్‌ కాస్మిక్‌’ అన్నది ‘ట్యాగ్‌లైన్  ’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నరేష్‌ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ కీలక  పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌– హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 4న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

జూన్‌ 30న ‘అల్లరి’ నరేష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘‘అల్లరి’ నరేష్‌ నటిస్తున్న 65వ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. విభిన్నమైన కథలు, మంచి కంటెంట్‌ చిత్రాలతో ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్న నరేష్‌ తనను హీరోగా నిలబెట్టిన కామెడీ జానర్‌లో మరోసారి సందడి చేయనున్నారు.

ఫాంటసీకి వినోదాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా వినోదభరితమైన ఘటనలతో సరికొత్త థియేట్రికల్‌ అనుభూతిని అందించనుంది. నరేష్‌ వీకే, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాస్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్, కెమెరా: రాంరెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement