ఓటీటీలో అక్షయ్ కుమార్ రీమేక్‌ సినిమా 'సర్ఫిరా' | Akshay Kumar Sarfira Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో అక్షయ్ కుమార్ రీమేక్‌ సినిమా 'సర్ఫిరా'

Sep 26 2024 3:46 PM | Updated on Sep 26 2024 3:52 PM

Akshay Kumar Sarfira Movie OTT Streaming Date Locked

అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ 'సర్ఫిరా' ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర తెరకెక్కించిన ఈ చిత్రం జులై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సూర్య ప్రధాన పాత్రలో నటించిన  'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి రీమేక్‌గా సర్ఫిరా బాలీవుడ్‌లో రిలీజ్‌ అయింది. ఇందులో  రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో  నటించారు. బాక్సాఫీస్‌ వద్ద 'సర్ఫిరా' చిత్రానికి నిరాశే మిగిలింది. అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే, సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి విడుదల అవుతుంది.

సర్ఫిరా చిత్రాన్ని ఈ చిత్రాన్ని అబండెన్షియా ఎంటర్‌టైన్‌మెంట్‌, సూర్య హోం బ్యాన‌ర్ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కేప్‌ ఆఫ్ గుడ్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తే.. రూ. 30 కోట్లు మాత్రమే రాబట్టినట్లు బాక్సాఫీస్‌ లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు 'సర్ఫిరా' సినిమా వస్తుంది.  డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో అక్టోబర్ 11 నుంచి 'సర్ఫిరా' స్ట్రీమింగ్‌ అవుతుందని అక్షయ్‌ కుమార్‌ అధికారికంగా ప్రకటించారు.

ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని సర్ఫిరా చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించనంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, ఇదే సినిమాకు మాతృక సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' మాత్రం ఓటీటీలో భారీ విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement