ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్ | Sakshi
Sakshi News home page

Niharika: ప్రేమ గురించి నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్

Published Fri, Feb 23 2024 4:25 PM

Actress Niharika Konidela Interesting Post On Love And Beach - Sakshi

మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం నటిగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. కొన్ని సినిమాలు చేసింది. ఓ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నిర్మాతగా మారింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు గతేడాది ప్రకటించింది. ప్రస్తుతం సోలోగానే ఉంది. తాజాగా ప్రేమ గురించి ఈమె పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. యూట్యూబ్ వెబ్ సిరీస్‌లతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. చిరంజీవి 'సైరా'లో జస్ట్ కాసేపు కనిపించే అతిథి పాత్రలో మెరిసింది. నటిగా కాస్త బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా పలు ఓటీటీ చిత్రాలు చేసింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

2020లో చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఓ మూడేళ్లు బాగానే ఉన్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో గతేడాది వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎక్కువగా ట్రావెల్ చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న నిహారిక తాజాగా ప్రేమ గురించి ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. 'నీకు కావాల్సింది ప్రేమ-బీచ్ మాత్రమే' అని ఉన్న ఫొటోని స్టోరీలో ఉంచింది.

అయితే నిహారిక ప్రేమ గురించి పోస్ట్ పెట్టడం చూస్తుంటే మెగా డాటర్ మళ్లీ ప్రేమలో పడిందా? ఏమైనా హింట్ లాంటిది ‍ఇస్తోందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే ప్రేమని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)

Advertisement
 
Advertisement
 
Advertisement