బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ ఇవాళ అఫీషియల్‌గా ఒక్కటయ్యారు. ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ నివాసంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తమ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
కాగా.. గతేడాది అమిర్ ఖాన్ తన బర్త్ డే సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశారు. తాను 25 ఏళ్లుగా తెలిసినప్పటికీ.. గత రెండేళ్లుగా డేటింగ్ ప్రారంభించామని అమిర్ ఖాన్ వెల్లడించారు. గతంలో అమిర్ ఖాన్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో చిత్రనిర్మాత కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వీరిద్దరు 2021లో విడిపోగా.. ఓ కుమారుడు ఆజాద్ ఉన్నారు.
మరోవైవు బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్.. వెల్‌నెస్ అండ్ బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో సెలూన్ యజమాని అయిన రీటా స్ప్రాట్ కుమార్తెనే గౌరీ. గతంలో 2004లో లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్‌లో ఫోటోగ్రఫీలో కోర్సును గౌరీ అభ్యసించారు. ఆమె ప్రస్తుతం ముంబైలో ఒక బిబ్లంట్ అనే సెలూన్ నడుపుతున్నారు.


