స్నేహం అంటే మన మనస్సులోని అన్ని రహస్యాలను పంచుకోగల బంధం. నిజమైన స్నేహితుడు సుఖంలోనూ, కష్టంలోనూ ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు. నిజమైన స్నేహితులు మన శ్రేయస్సును కోరుకుంటే స్నేహం పేరుతో మనల్ని ముంచేవాళ్లు కూడా ఉంటారు. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి వారినే ఎంచుకోవాలి. – సిరివెన్నెల, బీజెడ్సీ, సిద్దిపేట.
తోడు నీడగా ఉండాలి
స్నేహితులు అంటే ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. స్నేహితులు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు. అలాంటి స్నేహితులు దొరకడం అదృష్టం. నిస్వార్థమైన స్నేహం కలకాలం నిలుస్తుంది.
–అంజలి, డిగ్రీ విద్యారిన్థి, సిద్దిపేట.
తేడాలను చూపనిదే స్నేహం
కుల, మతం, భాష, సంపద అనే తేడాలను దాటి మనుషులను కలిపే గొప్ప బంధమే స్నేహం. జీవితంలో సంపదకంటే మంచి స్నేహితులు ఉండటం గొప్ప అదృష్టం.
–మోహన్ బికాం, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట.


