చిట్టా విప్పాల్సిందే..! లేదంటే న్యాయపరమైన చిక్కులు!

- - Sakshi

కేసుల వివరాలు వెల్లడిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు

సుప్రీంకోర్టు ఆదేశాలతో దినపత్రికల్లో ప్రకటనలు!

మెదక్‌లో ఇద్దరు, నర్సాపూర్‌లో ఒక్కరు వెల్లడి..

సాక్షి, మెదక్‌: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల చిట్టాను బయట పెట్టాల్సిందే.. ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎన్ని కేసులు ఉన్నాయి? అనే విషయాలు ప్రజలకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం తెలిసిందే. దాని కోసం అభ్యర్థులు కూడా సిద్ధమయ్యారు. నామినేషన్లు వేసిన సమయంలో తమ కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు వాటిని ప్రముఖ దినపత్రికల్లో ప్రకటిస్తున్నారు.

పారదర్శకంగా వ్యవహరించాలి..
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి నేరచరిత్ర ఉన్నా బయట పెట్టాలన్న సుప్రీంకోర్టు నిబంధనల మేరకు అభ్యర్థులు తమపై ఉన్న కేసులను బయట పెడుతున్నారు. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్‌ నియోజకవర్గం బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా, నర్సాపూర్‌ బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించాలి. రాజకీయంగా పారదర్శకత పాటించే ఏ నాయకుడికీ ఈ ప్రకటనలు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

రాజకీయ నాయకుడు అన్నాక కేసులు ఉండడం సర్వసాధారణమే. ప్రజా సమస్యల పోరాటంలో భాగంగా.. ఏదో ఒక సమయంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసే సమయంలో కేసులు నమోదవుతుంటాయి. తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని పార్టీల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. అందులో చాలా వరకు కొట్టివేయగా.. ఇంకొన్ని విచారణ దశలో ఉన్నాయి. రాజకీయ జీవితం మొదలు కాకముందు, రాజకీయాల్లోకి వచ్చాక వ్యక్తిగత కారణాలతో నమోదైన క్రిమినల్‌ కేసులు కొందరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో ముగ్గురు అందజేత..
మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా ఇప్పటి వరకు ముగ్గురు అభ్యర్థులు పత్రికా ప్రకటనల ద్వారా కేసుల వివరాలు వెల్లడించారు. తర్వాత ఆ పేపర్‌ కటింగ్‌లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు అందజేశారు. ఒకవేళ సదరు అభ్యర్థులపై కేసులు ఉండి పత్రికల ద్వారా వెల్లడించకపోతే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో ప్రజాసమస్యలపై పోరాటాలు చేసిన వారికి ఇది కలిసొచ్చే అంశం కాగా, ఉద్దేశపూర్వక నేరచరిత్రులకు మాత్రం ఇబ్బంది కలిగే అంశమని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: వస్తారా.. రారా..?

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-11-2023
Nov 25, 2023, 08:21 IST
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: మహబూబ్‌నగర్‌కు చెందిన సాయిరాఘవ కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉన్న...
25-11-2023
Nov 25, 2023, 08:19 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు...
25-11-2023
Nov 25, 2023, 08:19 IST
సాక్షి, మహబూబాబాద్‌/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్‌: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్‌ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్‌ఎస్‌కూ కాలం చెల్లింది. ఓటమికి...
25-11-2023
Nov 25, 2023, 07:55 IST
సాక్షి, కరీంనగర్‌: ‘కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.9వేల కోట్లు తెచ్చిన. మీ ఆశీర్వాదంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం...
25-11-2023
Nov 25, 2023, 04:44 IST
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు దూసుకెళ్తున్నాయి. రాజకీయ నేతల సుడిగాలి పర్యటనల్లో గిరికీలు కొడుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల కంటే...
25-11-2023
Nov 25, 2023, 04:44 IST
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్‌కు ఎంబీటీ పోరు తప్పడం లేదు. ఏకంగా యాకుత్‌పురా అసెంబ్లీ స్థానంలో తీవ్రమైన పోటీ...
25-11-2023
Nov 25, 2023, 04:42 IST
సాక్షి, మెదక్‌: టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కొందరు, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు, ఇలా చాలా మంది...
24-11-2023
Nov 24, 2023, 17:54 IST
సాక్షి, నారాయణఖేడ్‌: బీఆర్‌ఎస్‌ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్‌...
24-11-2023
Nov 24, 2023, 15:59 IST
టేబుల్‌ మీద ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్లే తెలంగాణ కేబినెట్‌లో మంత్రులు అవుతూ..
24-11-2023
Nov 24, 2023, 15:17 IST
సాక్షి,హైదరాబాద్‌ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
24-11-2023
Nov 24, 2023, 13:58 IST
కాంగ్రెస్‌ వల్ల 58 ఏళ్లు తెలంగాణ గోసపడింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. 
24-11-2023
Nov 24, 2023, 13:08 IST
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే...
24-11-2023
Nov 24, 2023, 12:10 IST
తుర్కపల్లి: అవినీతి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని...
24-11-2023
Nov 24, 2023, 11:49 IST
మహబూబ్‌నగర్‌: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ...
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
ఖమ్మంలో తుమ్మల కోసం కాకుండా పువ్వాడ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న.. 
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
శాలిగౌరారం: 80 సంవత్సరాలు పైబడిన వారితో పాటు అంగవైకల్యం కలిగిన వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు మండలానికి వచ్చిన ఎన్నికల...
24-11-2023
Nov 24, 2023, 10:40 IST
మెదక్‌/తూప్రాన్‌: బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌...
24-11-2023
Nov 24, 2023, 10:34 IST
రాజ్‌నీతి సర్వే సంస్థ తెలంగాణపై తాజాగా తన సర్వే నివేదికను విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) మరోసారి తన...
24-11-2023
Nov 24, 2023, 10:21 IST
సాక్షి,ఆదిలాబాద్‌: బోథ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు ప్రయోజనమెంతా అనే చర్చ ప్రస్తుతం ఆ పార్టీలో సాగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీల ప్రచారం...
24-11-2023
Nov 24, 2023, 10:18 IST
నిర్మల్‌ ఖిల్లా: ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమరం కొనసాగుతోంది. మరోవారం రోజుల్లో పోలింగ్‌ ఉండడంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే... 

Read also in:
Back to Top