దాడి కేసులో ఏడుగురి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

దాడి కేసులో ఏడుగురి రిమాండ్‌

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఈ నెల 23న ఒకరిపై దాడికి పాల్పడిన ఏడుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గోపతి సురేష్‌ తెలిపారు. దండేపల్లి మండలం వెల్గనూర్‌కు చెందిన బండ సురేష్‌ రేషన్‌ బియ్యం, కలప అక్రమాలకు పాల్పడుతుండేవాడన్నారు. సంబంధిత అధికారులు పట్టుకున్నప్పుడు అదే గ్రామానికి చెందిన పర్సవేని అనిల్‌ సమాచారం ఇస్తున్నాడనే అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23న అనిల్‌, అతని స్నేహితులు వినయ్‌, విష్ణువర్దన్‌ పట్టణంలో పూజ వస్తువులు కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో సురేష్‌ అతని స్నేహితులు చందనగిరి నవీన్‌, చందనగిరి నరేష్‌, పెట్టెం సాయికుమార్‌, బండె అజయ్‌కుమార్‌, కుండారపు అభిలాష్‌, గంగుల కుమారస్వామితో కలిసి దాడికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కే సు నమోదు చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి స్విప్ట్‌ డిజైర్‌ కారు, రెండు బైకులు రెండు ఇనుప రాడ్లు, రెండు కర్రలు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement