జిల్లాలో పర్యాటక అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పర్యాటక అభివృద్ధి

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రకృతి వనరులు, పర్యావరణ సమతుల్యత, చారిత్రక, ఆధ్యాత్మిక, సాహస పర్యాటకానికి జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, డీఆర్వో మోతిరామ్‌, జిల్లా పర్యాటక నోడల్‌ అధికారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ విలాయ్‌ అలీతో కలిసి టూరిజం శాఖ లోగో, మ్యాగజైన్‌ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రదేశాలను విస్తృతంగా ప్రచారం చేసి పర్యాటకుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పాఠశాల, ఇంటర్మీడియెట్‌ స్థాయిలో పర్యాటకంపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్‌, చిత్రలేఖన పోటీల విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

వృద్ధుల సంక్షేమానికి చర్యలు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వయోవృద్ధుల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026 పురస్కరించుకుని వయోవృద్ధుల సంక్షేమం, సాధికారత వారోత్సవాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 28న సైబర్‌ భద్రత, డిజిటల్‌ అక్షరాస్యత, వయోవృద్ధులపై వేధింపుల నుంచి రక్షణ, 29న తరతరాల మధ్య అనుబంధం, పరస్పర అభ్యాస కార్యక్రమాలు, 30న తల్లిదండ్రులు, వయోవృద్ధులకు వేధింపులు తదితర సమస్యలు ఎదురైనప్పుడు అధికారులను సంప్రదించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సహాయం కోసం హైల్ప్‌లైన్‌ నంబర్లు 14567, 100ను సంప్రందించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement