‘శ్రావణపల్లి’ దక్కేనా? | - | Sakshi
Sakshi News home page

‘శ్రావణపల్లి’ దక్కేనా?

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

బొగ్గు గనుల వేలంలో ప్రతిపాదిత ఓసీపీ

ఇప్పటికే సర్వే పూర్తయిన శ్రావణపల్లి బ్లాక్‌

తాజాగా కేంద్రం యాక్షన్‌లో చేర్చడంతో ఆశలు

అందుబాటులోకి వస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మరోసారి బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్న త రుణంలో జిల్లా పరిధిలో ఉన్న శ్రావణపల్లి గని సింగరేణికి దక్కుతుందా? లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే సింగరేణి కంపెనీ కి మణుగూరు పీకేఓసీ–2, తాడిచర్ల బ్లాక్‌లు నామి నేషన్‌ ప్రాతిపదికన దక్కాయి. తెలంగాణ పరిధిలో మిగిలిన ఉన్న బ్లాక్‌లను సైతం నామినేషన్‌ పద్ధతిన సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది. గతంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడి బ్లాక్‌ను సింగరేణికి కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరారు. అయితే నామినేషన్‌ పద్ధతిలో కాకుండా ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం సింగరేణి కంపెనీ సైతం ప్రైవేటు వ్యక్తులతో పోటీపడి వేలంలో దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా 16వ విడత వేలం ఈ నెల 17ప్రారంభం కాగా, నెలాఖరులో బిడ్‌ల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ క్రమంలో వేలంలో కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్‌ 3, జిల్లాలోని నెన్నెల మండలం శ్రావణపల్లి ప్రతిపాదిత ఓపెన్‌ కాస్ట్‌(ఓసీపీ) కోసం సింగరేణి బిడ్‌లు దాఖలు చేసేందుకు సన్నద్ధమైంది. దీంతో కొత్త గనుల కోసం కంపెనీ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేటు సంస్థల పోటీతో బ్లాక్‌ను దక్కించుకోవాల్సి ఉంది.

బ్లాక్‌ వస్తే ఊరట

బొగ్గు గనుల జిల్లాగా పేరుగాంచినప్పటికీ కాలక్రమేణ ఆ వైభవం కనుమరుగవుతోంది. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే బెల్లంపల్లి ఏరియాలో రెండు గనులు, మందమర్రి ఏరియాలో ఆరు, శ్రీరాంపూర్‌ ఏరియాలో పది గనులు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలోనే చాలా వరకు గనుల నిల్వలు పూర్తి కానున్నాయి. మరోవైపు భూగర్భ గనుల నుంచి బొగ్గు వెలికితీత భారంగా మారడంతో సంస్థ వ్యయాన్ని తగ్గించుకుంటోంది. ఇప్పటికే శాంతిఖని గనిని ప్రైవేటుకు నిర్వహణ, అభివృద్ధి పేరుతో అప్పగించేందకు సైతం సిద్ధపడింది. గత కొంతకాలంగా కంపెనీకి కొత్త గనులకు అనుమతులు రావడం లేదు. దీంతో స్థానికులకు ఉపాధి కరువవుతోంది. బొగ్గు, బొగ్గు ఆధారిత పరిశ్రమలు మూత పడుతున్నాయి. వేలాది మందిపై ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో కొత్త గని అందుబాటులోకి వస్తే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

వ్యతిరేకించిన స్థానికులు

నెన్నెల మండలం శ్రావణపల్లి ఓసీపీ ప్రతిపాదన సమయంలో సర్వేను స్థానికులు వ్యతిరేకించారు. ఇళ్లు, సాగు భూములు కోల్పోవడంపై జెండావెంకటాపూర్‌, నార్వాయిపేట, జోగాపూర్‌, మామిడిపల్లి, సారంగపల్లి ప్రభావితం కానున్నాయి. ఈ క్రమంలో సర్వే సమయంలోనే అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొత్త గని వేలం దక్కితే ఈ గ్రామాల భూ సేకరణలో సమస్యలు తీర్చి ముందుకెళ్లాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement