మహిళా చైతన్యానికి ప్రతీక | - | Sakshi
Sakshi News home page

మహిళా చైతన్యానికి ప్రతీక

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

మంచిర్యాలక్రైం: మహిళా చైతన్యం, ఆత్మగౌరవానికి తెలంగాణ వీరవనిత, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఒక ప్రతీక అని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శనివారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీ మాట్లాడుతూ పెత్తందార్ల దురాగతాలు, నాటి నిరంకుశ రజాకార్లు, దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ మొక్కవోని ధైర్యంతో పోరాడిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్‌) కె.శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ నాగేంద్రగౌడ్‌, ఏఓ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు శేఖర్‌, సీసీ సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement