● ఆడపిల్లలు భారం కాదు.. భవిష్యత్‌ ● తల్లిదండ్రుల అభిప్రాయం ● నేడు కూతుళ్ల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

● ఆడపిల్లలు భారం కాదు.. భవిష్యత్‌ ● తల్లిదండ్రుల అభిప్రాయం ● నేడు కూతుళ్ల దినోత్సవం

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

● ఆడపిల్లలు భారం కాదు.. భవిష్యత్‌ ● తల్లిదండ్రుల అభిప్రాయం ● నేడు కూతుళ్ల దినోత్సవం

చదువెందుకు అన్నరు.. ఉద్యోగాలు సాధించారు..!

బెల్లంపల్లి: నేను ఇంటర్మీడియట్‌ వరకు చదివిన. పరుగుపందెంలో నెగ్గి బాయిపని ఉద్యోగం సాధించిన. నలుగురు కూతుళ్లు. వ్యవసాయం జీవనాధరమైన నాకు ఉన్నతంగా చదివే అవకాశం కలుగలేదు. ఆడబిడ్డలను ఉన్నతంగా చదివించాలని బలంగా నిర్ణయించుకున్న. ఆడబిడ్డలకు చదువెందుకు అన్నరు. ఎవరెన్ని చెప్పినా, ఆటంకాలు వచ్చినా లెక్క చేయలేదు. సింగరేణిలో తట్టమోసుడు అంటే నరకం చూసినట్లే. నాగపోకుండా డ్యూటీలు చేసిన. మేము ఆశించినట్లుగానే పెద్దమ్మాయి జ్యోతి ఎంఎస్‌, ఓబీజీ, డీజీవో చదివింది. రామగుండం ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తోంది. రెండో బిడ్డ స్వాతి బీఎస్సీ, స్టాటిస్టిక్స్‌, ఎంసీఏ చదివి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీర్‌గా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ రేంజ్‌లో పని చేస్తోంది. మూడో బిడ్డ కృష్ణవేణి జీఎన్‌ఎం చేసి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్‌ ఆఫీసర్‌గా చేస్తోంది. చిన్న బిడ్డ సుజాత బీఎస్సీ, బీఈడీ చదివి ఎస్సై ఉద్యోగానికి సిద్ధమవుతోంది.

– సింగరేణి రిటైర్డు కార్మికుడు చిలుముల పోశం, గౌరమ్మ, బెల్లంపల్లి

ఆడపిల్ల పుట్టిందనగానే అయ్యో అనేవారు..! వారసుడి కోసం ఎదురు చూసేవారు..! ఇదంతా గతం. తరం మారుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది. ఆడపిల్లలూ తక్కువేం కాదని తల్లిదండ్రులు వారికి స్వేచ్ఛనిస్తున్నారు. విద్య, వైద్యం, ఇంజనీరింగ్‌, పోలీసు ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే ప్రోత్సహిస్తున్నారు. కూతుళ్లూ తల్లిదండ్రుల కలలను నిజం చేస్తూ ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు పంచుకుంటూ తల్లిదండ్రులకు కూతురమ్మలు అవుతున్నారు. నేడు కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement