సమన్వయంతో పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పని చేయాలి

Sep 27 2026 12:28 AM | Updated on Sep 27 2026 12:28 AM

మంచిర్యాలక్రైం: కోర్టు సిబ్బంది, లైజన్‌ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, ఐటీ విభాగం అందరూ ఒకే బృందంగా సమన్వయంతో పని చేయాలని జిల్లా జడ్జి ఏ.వీరయ్య, రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ ఝా అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో క్రిమినల్‌ జస్టిస్‌, కోర్టు ఇన్ఫర్మేషన్‌సిస్టంపై సమీక్షించారు. ఈ ఎఫ్‌ఐఆర్‌, ఈ చార్జిషీట్‌, ఈ సమన్స్‌, సీసీటీఎన్‌ఎస్‌లో సమాచార నవీకరణ, కేసుల పురోగతి, చార్జీషీటు దాఖలు, పోలీసుశాఖ, న్యాయస్థానాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. డీసీపీ భాస్కర్‌, న్యా యమూర్తులు ఏ.నిర్మల, డి.రామ్మోహన్‌రెడ్డి, కే.నిరోష, కృష్ణతేజ, ఏసీపీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement