చెన్నూర్: చెన్నూర్‌లో ఆర్‌ఎంపీగా పని చేస్తున్న. రెండో సంతానంగా అమ్మాయి పుట్టింది. చిన్న సంపాదన, ఆడబిడ్డ అంటే మాటలు కాదని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అనే మాటలకు ఇబ్బంది పడ్డాం. వారి మాటలు పట్టించుకోకుండా కూతురు తిప్పర్తి సుష్మను బాగా చదివించాను. పట్టుదలతో చదివి డేటా సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇన్ఫినిటమ్ మీడియా నెట్‌వర్క్ యూట్యూబ్‌లో పని చేస్తోంది. అమృతం వైబ్స్, నా పేరు మీనాక్షి, కపుల్ గోల్స్‌లో మెయిన్ రోల్ చేసింది. రెండు తెలుగు సినిమాల్లో చేస్తోంది. నటనను చూసి నిత్యం ఫోన్లు వస్తుంటాయి. అమ్మాయి గొప్పతనం చెబుతుంటే ఆనందం కలుగుతుంది. ఆనాడు భారం అన్నవాళ్లు నేడు నోరెళ్లబెడుతున్నారు. మా అమ్మాయే మమ్మల్ని ఈ సమాజానికి పరిచయం చేసింది. – తిప్పర్తి గోపాల్, శ్రీకళ, చెన్నూర్


