మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. శిథిలావస్థకు చేరిన భవనంలోనే ఎక్స్‌రే గదిని ఏర్పాటు చేశారు. గురువారం గది లోపల, బయట సీలింగ్ కోసం వేసిన పీవోపీ ఊడి కింద పడేందుకు సిద్ధమవగా వైద్యులు గుర్తించి తొలగింపజేశారు. ఎక్స్‌రే మిషన్ ఒక్కటే ఉండడం, ప్రతీరోజు 30మందికి పైగా ఎక్స్‌రే కోసం వస్తుంటారు. ఒక్క మిషన్ వల్ల రోజంతా సమయం వృథా అవుతోంది. సిబ్బంది పీవోపీని తొలగించే క్రమంలో గంటల తరబడి ఆపడంతో ఇబ్బందులకు గురయ్యారు.
పీవోపీ తొలగిస్తున్న సిబ్బంది


