
డ్రోన్‌తో గ్రామీణ యువతకు ఉపాధి
దండేపల్లి/లక్సెట్టిపేట/మంచిర్యాలఅగ్రికల్చర్: ఎరువుల పిచికారీకి అందుబాటులోకి వచ్చిన డ్రోన్ టెక్నాలజీ గ్రామీణ యువతకు ఉపాధినిస్తోందని డీ ఈవో ఛత్రునాయక్ తెలిపారు. మంగళవారం ఆయ న దండేపల్లి మండలం ముత్యంపేట రైతువేదికలో నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో పా ల్గొన్నారు. ముత్యంపేట, లక్సెట్టిపేట మండల కేంద్రంలో ఫెర్టిలైజర్ షాపులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా 2552.157 మెట్రిక్ టన్నులు, డీఏపీ 588.5, ఎంవో పీ 862.55, కాంప్లెక్స్ 4342.175, ఎస్‌ఎస్‌పీ 451.3 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అవసరం మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. ఏడీఏలు అనిత, గోపి, వ్యవసాయాధికారులు అంజిత్‌కుమార్, శ్రీకాంత్, ఏఈ వోలు నరేశ్, సుజన్య, మౌనిక, శ్రీకన్య పాల్గొన్నారు.