
కలశయాత్రకు ఘన స్వాగతం
మందమర్రిరూరల్: 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో 114 మంది యాదవ జవాన్లు వీరమరణం పొందారని బిహార్ రాష్ట్ర మాజీ సైనికాధికారి కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. వారి స్మారకార్ధం కిరణ్‌కుమార్ చేపట్టిన రేజాంగుల రాజ్ కలశయాత్ర మంగళవారం మందమర్రికి చేరుకుంది. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం ఆధ్వర్యంలో ఘన స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఇందూ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిరణ్‌కుమార్ మాట్లాడుతూ 122 రోజుల క్రితం ప్రారంభమైన యాత్ర ఇప్పటికే 28 రాష్ట్రాలు తిరిగామన్నారు. నవంబర్ 19న ఢిల్లీలో ముగియనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు మల్లెత్తుల నరేష్ యాదవ్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, యశ్వంత్‌రాజ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.