
మెడికల్ బోర్డులో లోపాలు సరిచేయాలి
శ్రీరాంపూర్: సింగరేణి మెడికల్ బోర్డులో లోపాలను సరిచేయాలని కోరుతూ జీఎల్‌బీకేఎస్ గౌరవ అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శి జే.సీతారామయ్య మంగళవారం హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీ ఎన్.బలరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల మెడికల్ బోర్డులో అర్హులైన చాలామందిని అన్‌ఫిట్ చేయాల్సి ఉండగా ఫిట్ ఇచ్చి అన్యాయం చేశారన్నారు. చాలామంది కార్మికులు జబ్బులతో బాధపడుతున్నారన్నారు. తిరిగి మెడికల్ బోర్డు నిర్వహించి ఫిట్ ఇచ్చిన వారిని తిరిగి స్క్రీనింగ్ చేయాలని కోరారు. అంతే కాకుండా పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ల ఉద్యోగాలను త్వరితగతిన సెటిల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు ఎం.శ్రీనివాస్, జీ.అనురాధ, తదితరులు పాల్గొన్నారు.