ఇచ్చోడ: మండలంలోని ముఖరా బి గ్రామానికి చెందిన గర్భిణి ప్రతిక్షకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త అనిల్ 108కు సమాచారం అందించాడు. అంబులెన్సులో ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ రాకేశ్, ఈఆర్‌సీపీ డాక్టర్ కౌశిరెడ్డి సలహా మేరకు వాహనంలోనే డెలివరీ చేశారు. మొదటికాన్పులో ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీపిల్లలు క్షేమంగా ఉండటంతో వారిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పైలట్ వినోద్, ఈఎంటీ రాకేశ్‌ను గ్రామస్తులు అభినందించారు.